దేశంలో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ సోకిన వైరస్.. కేరళ వైద్య విద్యార్థినికి రెండోసారి పాజిటివ్
దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌కు మళ్ళీ కరోనా సోకింది. కేరళకు చెందిన వైద్య విద్యార్థిని దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కావడం తెలిసిందే.
Covid-19 India: దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడిన తొలి పేషెంట్‌కు మళ్ళీ కరోనా సోకింది. కేరళకు చెందిన వైద్య విద్యార్థిని దేశంలో నమోదైన తొలి కరోనా కేసు కావడం తెలిసిందే. త్రిసూర్ కు చెందిన 20 ఏళ్ల ఆ వైద్య విద్యార్ధిని చైనాలోని ఉహాన్‌లో ఓ మెడికల్ యూనివర్సిటీలో చదువుకునేవారు. జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ విద్యార్ధినికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా కేసు. కరోనా పురిటి గడ్డ వుహాన్‌లోనే చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఆ వైద్య విద్యార్థిని జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు త్రిసూర్‌లోని ఆసుప్రతిలో క్వారెంటైన్‌లో ఉన్నారు. మూడు వారాల తర్వాత కరోనా బారి నుంచి ఆ విద్యార్ధిని కోరుకున్నారు.
తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమౌతుండగా ఆ విద్యార్థిని మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. తాజా పరీక్షల్లో ఆమెకు మరోసారి కరోనా పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. యాంటీ జెన్ టెస్ట్ లో పాజిటివ్‌గా వచ్చిందని త్రిసూర్ జిల్లా మెడికల్ అధికారి డాక్టర్ కేజీ రీనా తెలిపారు. అయితే ఆమెకు ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనిపించలేదని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలటంతో మళ్ళీ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ వైద్య విద్యార్ధిని ఇప్పటి వరకు ఒక్క డోస్ కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని తెలుస్తోంది. ప్రసుత్తం ఆ విద్యార్ధిని ఆరరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read..
ఫేక్ లెటర్‌తో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.. ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు
గుడ్‌న్యూస్.. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్ బిస్కెట్లు ..!