పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు ‘ఆప్’ తో ‘మిలాఖత్’ ? ఓల్డ్ వీడియో క్లిప్ తో పార్టీకి షాక్ !

పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా సంక్షోభం కొనసాగుతుండగా రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు సరికొత్త అంకానికి తెర తీశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆప్' లోగడ తనను ప్రశంసించిందంటూ పాత వీడియో క్లిప్ ను తెరమీదికి తీసుకువచ్చారు. 2017 లో బీజేపీని వదిలి...

పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు 'ఆప్' తో 'మిలాఖత్' ? ఓల్డ్ వీడియో క్లిప్ తో పార్టీకి షాక్ !
Navajot Singh Si
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 13, 2021 | 5:12 PM

పంజాబ్ కాంగ్రెస్ లో ఇంకా సంక్షోభం కొనసాగుతుండగా రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు సరికొత్త అంకానికి తెర తీశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ఆప్’ లోగడ తనను ప్రశంసించిందంటూ పాత వీడియో క్లిప్ ను తెరమీదికి తీసుకువచ్చారు. 2017 లో బీజేపీని వదిలి అకాలీదళ్ కు, బాదల్ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు ఆప్ నేత సంజయ్ సింగ్ తనను ప్రశంసించారని అంటూ ఆయన ఈ క్లిప్ ని రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం తాను చేస్తున్న కృషిని ఆప్ ఎప్పుడూ గుర్తిస్తూ వచ్చిందని, వీటికోసం ఎవరు పోరాడుతున్నారో ఆ పార్టీ బాగా అర్థం చేసుకుందని సిద్దు ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ఈయన ఆ పార్టీతో చేతులు కలుపుతారా అన్న ఊహాగానాలకు ఆస్కారమిచ్చారు. 2017 లోగానీ , అంతకుముందు గానీ పంజాబ్ సంక్షేమం కోసం నేను చేసిన కృషిని ఆప్ బాగా గుర్తించింది. అలాగే ఇప్పుడు అవినీతి, విద్యుత్ సంక్షోభ పరిష్కారానికి నేను చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆ పార్టీ హర్షిస్తోంది అని ఆయన చెప్పుకున్నారు.

అయితే కొందరు…. సిద్దు ఇదంతా ఆప్ పట్ల సెటైరిక్ గా వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనమని,గత 48 గంటల్లో ఆయన ఆప్ ను విమర్శిస్తూ వచ్చారని అంటున్నారు. పంజాబ్ కాంగ్రెస్ లో తనకు, సీఎం అమరేందర్ సింగ్ కు మధ్య ఉన్న విభేదాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే ఇదన్నది వారి అభిప్రాయం,. ఢిల్లీలో ఈయన, అమరేందర్ సింగ్ ఇద్దరూ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో సమావేశమైన తరువాత ఇద్దరి మధ్య (సిద్దు, అమరేందర్ సింగ్) సఖ్యత కుదిరిందని వీరు అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : విస్తారంగా దంచికొడుతున్న వర్షాలు..తడిసిముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు లైవ్ వీడియో..:Heavy Rains in Telugu States Live Video.

 కౌశిక్ రెడ్డి vs రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం.50 కోట్లు ఇచ్చి పీసీపీ చీఫ్‌ అయ్యారంటూ కామెంట్స్..:LIVE Video.

 ముంచుకొస్తున్న సౌర తుఫాన్..గతంలో సూర్యుడి ఉపరితలంపై భారీ తుఫాను..:Solar Storm Moving To Earth Live Video.

 ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.