BSNL Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. ఎంతంటే..!
BSNL Recharge Plan: కస్టమర్లను ఆకర్షించుకునేందుకు టెలికాం సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రరకటిస్తున్నాయి. ఆఫర్లతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్న రిలయన్స్..
BSNL Recharge Plan: కస్టమర్లను ఆకర్షించుకునేందుకు టెలికాం సంస్థలు పలు రకాల ఆఫర్లను ప్రరకటిస్తున్నాయి. ఆఫర్లతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కస్టమర్ల కోసం సరి కొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక మేమేమి తక్కువ కాదన్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL)కూడా ప్రత్యేక రీచార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తోంది. ఇక తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ మొదటి రీచార్జ్ కూపన్ (FRC) రూ.45 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఎఫ్ఆర్సీని ప్రమోషనల్ స్కీమ్ కింద ప్రారంభించి, లిమిటెడ్ ఆఫర్‌గానే అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.45 FRCతో రీఛార్జ్ చేసుకుంటే 10జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు పొందే అవకాశం ఉంది. ఇది 45 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది.
మరి 45 రోజుల తర్వాత..
అయితే కస్టమర్లను ఆ ఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 45 రోజుల వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు తమకు నచ్చిన ఇతర ప్లాన్‌లకు మారవచ్చు. ఆగస్టు 6 వరకు మాత్రమే ప్రమోషనల్ ప్రాతిపాదికన కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. కొత్త ఎఫ్ఆఆర్‌సీతో పాటు బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇది 60 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఎయిర్‌టెల్, వీఐ, జియో సంస్థలు సైతం తమ కస్టమర్ల కోసం దాదాపు ఇలాంటి ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి రూ.50లోపు డేటా ప్లాన్ లను కలిగి ఉన్నాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ రూ.45 ప్లాన్‌తో ఇతర టెలికాం సంస్థలతో పోటీ పడనుంది.
కాగా, ఇటీవలే బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) రూ.447 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 100జీబీ డేటా వస్తుంది. రోజూ ఎంతైనా డేటా వాడుకునే సౌకర్యం ఉంది. రోజువారీ డేటా లిమిటెడ్ అంటూ లేదు. 60 రోజులకు 100జీబీ డేటా పూర్తిగా వాడుకోవచ్చు. రూ.447 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో మొత్తం 100 జీబీ డేటా వాడుకున్న తర్వాత స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పు..
అయితే ఎస్‌టీవీ (STV) 247 ప్రీపెయిడ్ ప్లాన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ మార్పులు చేసింది. గతంలో రూ.247 స్పెషల్ టారిఫ్ వోచర్‌తో రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా వచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం 50 జీబీ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.