అభినవ కుంభకర్ణుడు..! 300 రోజులు నిద్ర తప్పా మరే పనిచేయడు.. కారణం తెలిస్తే షాకవుతారు..
ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి నిద్ర అవసరం. ఒక రోజు సరిగ్గా నిద్రపోకపోతే రోజు మొత్తం అతడు హుషారుగా ఉండలేడు. అందుకే ప్రశాంతమైన
ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి నిద్ర అవసరం. ఒక రోజు సరిగ్గా నిద్రపోకపోతే రోజు మొత్తం అతడు హుషారుగా ఉండలేడు. అందుకే ప్రశాంతమైన నిద్ర కంటే గొప్ప ఆనందం మరొకటి లేదని అంటారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి 24 గంటల్లో 7 నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ ఒక కేసు రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతాడు. దీనివల్ల ప్రజలు ఈ వ్యక్తిని కుంభకర్ణ అని పిలుస్తారు.
ఒక నివేదిక ప్రకారం.. ఈ కేసు నాగౌర్ జిల్లాలోని భద్వా గ్రామానికి చెందినది. ఇక్కడ నివసిస్తున్న 42 ఏళ్ల పూర్ఖారామ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా ఒకసారి అతను నిద్రలోకి జారుకున్నాక చాలా రోజులు లేవలేకపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని మేల్కొలపడానికి చాలా పాట్లు పడాల్సి వచ్చింది. ఒకసారి నిద్రపోయిన తర్వాత 25 రోజులు పడుకుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది ఇతడికి 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.
ప్రారంభ దశలో పూర్ఖరం 5 నుంచి 7 రోజులు నిద్రపోయేవాడు. మేల్కొనడంలో చాలా ఇబ్బంది పడేవాడు. అందువల్ల అతన్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కానీ ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. కాలక్రమేణా పూర్ఖారాం సమస్య పెరుగుతూనే ఉంది. క్రమంగా నిద్ర సమయం పెరిగింది. ఇప్పుడు పూర్ఖరం కొన్నిసార్లు 25 రోజుల నిద్రపోతాడు. వైద్యులు దీనిని అరుదైన వ్యాధి అని పిలుస్తారు. తన భర్త ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడని పూర్ఖరం భార్య లిచ్మి దేవి తెలిపారు. తనకు నిద్ర మాత్రమే వస్తుందని పూర్ఖరం చెప్పారు.
అతను స్వయంగా మేల్కొవాలని అనుకుంటాడు కానీ అతని శరీరం అతనికి సహకరించదు. అంతకుముందు 18 గంటలు నిద్రపోతే ఇప్పుడు 20-25 రోజులు నిద్రపోతున్నాడు. కొన్ని నివేదికలలో ఈ ప్రత్యేకమైన వ్యాధి పేరు హైపర్సోమ్నియాగా చెప్పారు. పూర్ఖారామ్ ఇప్పుడు యాక్సిస్ హైపర్సోమ్నియా బాధితుడు. ఈ వ్యాధి చాలా రకాలుగా ఉంటుంది. ఈ వింత వ్యాధి కారణంగా పూర్ఖరం చాలా రోజులు నిద్రపోతూనే ఉంటాడు. ఈ కేసులో నిపుణులు అతను ఎప్పటికీ కోలుకోరని చెప్పడం సరైనది కాదు. కానీ అతనికి తక్షణమే చికిత్స మాత్రం కచ్చితంగా అవసరం.