VIRAL VIDEO : తన ప్రవర్తనతో విసుగు తెప్పించిన యువతి.. హెయిర్ డ్రెస్సర్ కోపంతో ఏం చేసిందంటే..

VIRAL VIDEO : ఒక మహిళా సెలూన్‌లో ఓ యువతి జుట్టు కడుగుతున్నప్పడు జరిగిన సంఘటన ట్విట్టర్‌లో వైరల్‌గా మారుతోంది.

VIRAL VIDEO : తన ప్రవర్తనతో విసుగు తెప్పించిన యువతి.. హెయిర్ డ్రెస్సర్ కోపంతో ఏం చేసిందంటే..
Young Woman
Follow us
uppula Raju

|

Updated on: Jul 13, 2021 | 12:24 PM

VIRAL VIDEO : ఒక మహిళా సెలూన్‌లో ఓ యువతి జుట్టు కడుగుతున్నప్పడు జరిగిన సంఘటన ట్విట్టర్‌లో వైరల్‌గా మారుతోంది. యువతి ప్రవర్తన నచ్చని హెయిర్ డ్రెస్సర్ ఆమె ముఖంపై వాటర్ కొడతుంది. ఈ వీడియో కొద్దిరోజుల్లోనే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. అంతేకాదు వందలాది మంది దీనిపై కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూస్తే.. హెయిర్ డ్రెస్సర్ ఓ యువతి జుట్టు కడుగుతున్నప్పుడు తరచూ పక్కన ఉన్న ఆమె ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. గమనించిన హెయిర్ డ్రెస్సర్ ఆమెను మళ్లీ బేసిన్‌లోకి లాగుతుంది. అప్పుడు ఆ యువతి సారీ అంటూ సైగ చేసి మామూలుగా ఉన్నట్లు నటిస్తోంది. కొద్ది సేపటికి మళ్లీ ఆమె తలను అటు ఇటూ కదిలిస్తూ పక్కన ఉన్న ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. హెయిర్‌డ్రెస్సర్ పనికి అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. దీంతో విసుగెత్తిపోయిన ఆ లేడీ హెయిర్ డ్రెస్సర్ జుట్టు కడగడం మానేసి వాటర్ పైప్ తీసుకొని ఆమె ముఖంపై వేగంగా వాటర్ కొడుతుంది.

దీంతో ఆ యువతి మొత్తం తడిసిపోతుంది. అప్పుడు ఆ యువతి, ఆమె స్నేహితురాలు హెయిర్ డ్రెస్సర్ వైపు చూసి ఏ విధంగా స్పందించాలో తెలియకుండా చూస్తూ ఉంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంతమంది నవ్వుకుంటుంటే మరికొంతమంది కస్టమర్లపై ప్రవర్తించే తీరు ఇలాగే ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది ఫన్నీగా భావిస్తున్నారు.

చాణక్య నీతి : పిల్లల ఈ అలవాట్లను మాన్పించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారం..

EPFO : రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎంతకాలం వస్తుంది..! జాబ్ మానేసి చాలాకాలం అయితే ఏం చేయాలి..

Dhongalu: తెలుగురాష్ట్రాల్లో పశువుల దొంగల హల్‌చల్‌.. నిషారాత్రిలో హుషారుగా చోరీలు..

Harassment: డాక్టర్ వేధింపులను ఎదిరించినందుకు మహిళను చితకబాదారు..