AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harassment: డాక్టర్ వేధింపులను ఎదిరించినందుకు మహిళను చితకబాదారు..

Harassment: మహిళలపై వేధింపులు అస్సలు తగ్గడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల్ని వేధించడం విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

Harassment: డాక్టర్ వేధింపులను ఎదిరించినందుకు మహిళను చితకబాదారు..
Harassment
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 13, 2021 | 12:29 PM

Share

Harassment: మహిళలపై వేధింపులు అస్సలు తగ్గడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల్ని వేధించడం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చిన్న చిన్న విషయాలకు మహిళలపై దౌర్జన్యం చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించినందుకు ఒక మహిళను కనికరం లేకుండా కొట్టారు. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. మహిళపై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని హాజీపూర్ ప్రాంతంలో పురుషుల బృందం ఒక మహిళ, ఆమె కుమారుడిని కనికరం లేకుండా కొట్టిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఒక దంత వైద్యుడు రొటీన్ చెకప్ సమయంలో ఆ మహిళను వేధింపులకు గురిచేసినట్టు ఆమె ఆరోపించింది. ఈ విషయంపై దంతవైద్యునితో మాట్లాడిన సందర్భంలో తనను, తన కొడుకును కొట్టినట్లు ఆ మహిళ వీడియోలో పేర్కొంది.

శనివారం హాజీపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడై చౌక్ ప్రాంతంలోని క్లినిక్ వద్ద దంత పరీక్ష కోసం వెళ్లినప్పుడు తనను డాక్టర్ వేధింపులకు గురిచేసినట్లు ఆమె తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె కుమారుడు క్లినిక్ లోని చెకప్ గది వెలుపల వేచి ఉన్నాడు. డాక్టర్ తనపై అశ్లీలంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని వ్యతిరేకించింది. నిరసన వ్యక్తం చేసి, అభ్యంతరాన్ని తెలిపింది. ఆ మహిళ కేకలు విన్న ఆమె కుమారుడు గది లోపలికి వెళ్లి ఆమెను రక్షించాడు. “డాక్టర్ నన్ను వేధింపులకు గురిచేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అతను నా పై అశ్లీలంగా ప్రవర్తించాడు. దీంతో నేను నిరసన వ్యక్తం చేశాను ఈ సందర్భంలో నా కొడుకు జోక్యం చేసుకున్నాడు. దీనికి నిరసన తెలిపినందుకు ఆ డాక్టర్ తన గూండాలను మాపై పురిగొల్పాడు. దాంతో ఆ గూండాలు మా ఇద్దరినీ తీవ్రంగా కొట్టి హింసించారు.” అని ఆ మహిళ తెలిపింది.

ఈ ఘటనపై సదరన్ ఎస్‌డిపిఓ రాఘవ్ దయాల్ మాట్లాడుతూ, మహిళ వేధింపుల ఫిర్యాదును నమోదు చేసిందని, దీని కోసం ఐపిసి సంబంధిత విభాగాల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు చెప్పారు. ఇంతకు ముందు ఇలాంటి లైంగిక దుష్ప్రవర్తన సంఘటనల్లో నిందితుడు డాక్టర్ పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకూ అతనిపై ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు. ఈ విషయంపై నిందితుడి సోదరుడు మాట్లాడుతూ ఈ కేసులో వైద్యుడిని “తప్పుగా ఇరికించారు” అని చెప్పాడు. ఆ మహిళా వైద్యుని వద్దకు వచ్చిన సమయంలో ఫీజు చెల్లించడానికి ఆమె నిరాకరించింది అని ఆమె తెలిపారు. ఇదే విషయంపై అతను పోలీసులకు ఆ మహిళపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

Also Read: Atrocities: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు, సభ్యసమాజం తలదించుకునే ఉదంతాలు

Thief halchal: తెలుగురాష్ట్రాల్లో పశువుల దొంగల హల్‌చల్‌.. నిషారాత్రిలో హుషారుగా చోరీలు..