Thief halchal: తెలుగురాష్ట్రాల్లో పశువుల దొంగల హల్‌చల్‌.. నిషారాత్రిలో హుషారుగా చోరీలు..

లుగురాష్ట్రాల్లో పశువుల దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. నిషారాత్రిలో తమ హుషారు చూపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. నగరాలు, ఊళ్లపై పడి కనిపించిన అవులనల్లా దొంగలిస్తున్నారు.

Thief halchal: తెలుగురాష్ట్రాల్లో పశువుల దొంగల హల్‌చల్‌.. నిషారాత్రిలో హుషారుగా చోరీలు..
Cow
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2021 | 11:47 AM

తెలుగురాష్ట్రాల్లో పశువుల దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. నిషారాత్రిలో తమ హుషారు చూపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. నగరాలు, ఊళ్లపై పడి కనిపించిన అవులనల్లా దొంగలిస్తున్నారు. అడ్డువస్తే అవసరమైతే చంపేందుకు కూడా వెనకాడని విధంగా.. చేతిలో రివాల్వర్లు పెట్టుకుని మరీ చెలరేగిపోతున్నారు. రైతులను, ప్రజలను పరేషాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో అవులను ఎత్తుకు పోయారు దొంగలు. ఈ దృశ్యాలు సీసీ కెెమెరాలో రికార్డ్ అయ్యాయి. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో తెచ్చుకున్న ఆవులను ఇంటి ముందు కట్టేసుకున్నారు. ఇంటి దగ్గర కట్టేసి పెట్టిన వాటిని ఇలా ఎత్తుకెళ్లారు. ఆవు మెడకు కట్టిన తాడును పట్టుకుని.. టూ వీలర్‌పై గుంజుకుపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితులు ఎవరు.. ఎందుకు ఇలా చేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు.

ఇలా ఒక్కదగ్గరని కాదు.. పట్టణాలు, పల్లెల్లోనూ చెలరేగిపోతున్నారు. అయితే వీరంతా ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారన్నది మాత్రం తెలియడం లేదు. ఇటీవల చిత్తూరు పోలీసులకు చిక్కిన దొంగలు, కర్నాటక, హర్యానా రాష్ట్రాలకు చెందిన ముఠాల పనిగా అనుమానిస్తున్నప్పటికీ.. ఇంకా ఎవరెవరున్నారు. గోవులనే టార్గెట్‌ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటన్నది అంతుచిక్కకుండా మారింది.

బక్రీద్‌ సందర్భంగా తెచ్చుకున్ ఆవులనే కాకుండా పాడి కోసం ఇంట్లో కట్టేసుకున్న పశువులను సైతం ఎత్తుక పోతున్నారు. ఆ గోమాతలే వారికి సర్వం. సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఆవులు మాయమవుతుండడంతో ఆవేదన చెందుతున్నారు. తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని కన్నీటిపర్యంతమవుతున్నారు.

చిత్తూరు జిల్లాలో ఇలా పదుల సంఖ్యలో ఆవులు దొంగతనం అవుతుండడంపై ఇక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో బక్రీద్‌ కోసం తెచ్చుకున్న ఆవులను కొందరు తీసుకెళ్లగా.. వాటి కోసం తమ వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ MIM ఎమ్మెల్యేలు హోంమంత్రి మహమూద్‌అలీని కలిశారు.

తాము తెచ్చుకున్నవి నిషేధించిన పశువులు కాదని, పోలీసుల వేధింపుల నుంచి తమ వారిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు. పశువులను దొంగలించి ఇలా కొందరు.. వేరే రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇటీవల హర్యానా ముఠా తమిళనాడులో అమ్ముతుండగా.. పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి : Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?