Family Death: వర్షం వస్తుందని జనరేటర్ ఆన్ చేశారు.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి

Family Died: వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసి ఆ కుటుంబం నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంలో జనరేటర్ బంద్ చేయకపోవడంతో.. పేలిపోయి..

Family Death: వర్షం వస్తుందని జనరేటర్ ఆన్ చేశారు.. ఊపిరాడక ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2021 | 2:57 PM

Family Died: వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న జనరేటర్‌ను ఆన్ చేసి ఆ కుటుంబం నిద్రలోకి జారుకుంది. ఈ క్రమంలో జనరేటర్ బంద్ చేయకపోవడంతో.. పేలిపోయి.. ఆ ఇల్లు మొత్తం దట్టమైన పొగ (కార్బ‌న్ డై ఆక్సైడ్) వ్యాపించింది. దీంతో ఊపిరాడక కుటుంబంలోని అందరూ ప్రాణాలు కోల్పోయారు. చిన్న పొరపాటు కారణంగా ఒకే ఇంట్లో ఆరుగురు చనిపోయిన సంఘటన మ‌హారాష్ర్ట‌లోని చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రాపూర్ జిల్లాలోని దుర్గాపూర్‌లో సోవవారం రాత్రి ఈ దుర్ఘ‌ట‌న జరిగింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా దుర్గాపూర్‌లో సోమ‌వారం రాత్రి విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. దీంతో ర‌మేశ్ ల‌ష్క‌ర్ అనే వ్యక్తి త‌న ఇంట్లో ఉన్న జ‌న‌రేట‌ర్‌ను ఆన్ చేసి నిద్ర పోయాడు. ఈ క్రమంలో అది పేలి దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంత‌రం ఆ ఇంటి త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా.. ర‌మేశ్ కుటుంబంలోని ఏడుగురు గాయాలతో స్పహ లేకుండా కనిపించారు. ఇల్లు తెరిచిన స‌మ‌యంలో ఇంటి నిండా విష వాయువు ద‌ట్టంగా అలుముకుని ఉంద‌ని స్థానికులు పేర్కొన్నారు. వారిని ఇంటినుంచి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయని ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

జ‌న‌రేట‌ర్ నుంచి కార్బ‌న్ డై ఆక్సైడ్ విడుద‌ల కావ‌డంతో.. అందరూ ఊపిరాడ‌క మృతి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read:

Crime News : కొడుకు జీతం కోసం ఏటీఎంకు వెళ్లిన తండ్రిని ట్రాప్ చేశారు..! సాయం పేరుతో 40 వేలు దోచేశారు..

TikTok: టిక్‌టాక్ వీడియోల వ్యసనం.. ఎంతమంది జీవితాలు బలితీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!

వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?