Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్‌ ఫ్రీ అప్‌డేషన్‌ గడువు దగ్గర పడుతోంది.. మీ వివరాలన్నీ ఉచితంగా మార్చుకోండి..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచడం సంబంధిత పౌరుడి బాధ్యత. ఆధార్ కార్డ్‌ డిటైల్స్‌ అప్‌డేషన్‌ చేయడానికి తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి, https://myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు. 

Aadhaar Card: ఆధార్‌ ఫ్రీ అప్‌డేషన్‌ గడువు దగ్గర పడుతోంది.. మీ వివరాలన్నీ ఉచితంగా మార్చుకోండి..
Aadhaar Card
Follow us
M Sivakumar

| Edited By: Surya Kala

Updated on: Nov 24, 2023 | 11:40 AM

ఆధార్ కార్డ్‌లోని వివరాలను పూర్తి ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు చివరి తేదీ ‍దగ్గర పడుతోంది. ఫ్రీ అప్‌డేషన్‌ గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే పెంచింది. అంతకు ముందు సెప్టెంబరు 14, 2023 వరకూ గడువు ఉండేది. ప్రజలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన ప్రభుత్వం, ఈ గడువును 3 నెలలు పెంచింది. మీ ఆధార్‌ కార్డ్‌లో.. మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఉన్నా, జెండర్‌లో తప్పు దొర్లినా, మీ అడ్రస్‌, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ మారినా ఇప్పుడు ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. అయితే, గడువు దగ్గర పడుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోండి..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచడం సంబంధిత పౌరుడి బాధ్యత. ఆధార్ కార్డ్‌ డిటైల్స్‌ అప్‌డేషన్‌ చేయడానికి తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి, https://myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లవచ్చు.

UIDAI పోర్టల్‌లోకి వెళ్లి, ఆన్‌లైన్‌ ద్వారా, మీ ఇంటి చిరునామా, మీ పేరు మొదలైన సమాచారాన్ని ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీని కోసం వినియోగదార్లు తమ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్ దగ్గర పెట్టుకోవాలి. రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి, చిరునామా సహా ఇతర వివరాలను మార్చవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆఫ్‌లైన్‌..ఆధార్‌ కేంద్రం కి వెళ్లి ఆధార్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలనుకుంటే మాత్రం 25 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.. ముందుగా myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.. మీ పేరు , లింగం , పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్లు ఎంచుకోండి. అప్‌డేట్ ఆధార్ ఆప్షన్‌ ఎంచుకోండి. ఇప్పుడు, చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను అప్‌డేట్‌ చేయండి. ఇప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ వస్తుంది. ఆ నెంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నెంబర్‌ ఉపయోగపడుతుంది.

ఆధార్ కార్డ్‌లో మార్పుల కోసం మీరు రిక్వెస్ట్‌ చేసిన తర్వాత, మీకు URN నంబర్ వస్తుంది. అది మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు కూడా SMS ద్వారా అందుతుంది. మీరు https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ వివరాల అప్‌డేషన్‌ స్థితిని కూడా ట్రాక్ చేయవచ్చు.

మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. పుట్టిన తేదీ, పేరు, చిరునామాలో తప్పులు దొర్లినా మీ ఆధార్ డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్