Heart Health: కాలి పాదం నుంచి గుండెకు కనెక్షన్! మీ పాదాలతో ఇది చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా?

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఓ మంచి చిట్కాను నిపుణులు చెబుతున్నారు. అందేంటంటే మీ కాలి పాదాలను ఎప్పుడూ కదుపుతూ ఉండాలంట! అదేంటి కాలి పాదాలు కదుపుతూ ఉంటే గుండె ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.

Heart Health: కాలి పాదం నుంచి గుండెకు కనెక్షన్! మీ పాదాలతో ఇది చేయకపోతే ఎంత ప్రమాదమో తెలుసా?
toes exercise
Follow us

|

Updated on: May 17, 2023 | 4:30 PM

శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే గుండె ఆరోగ్యంగా ఉండాలి. గుండె పంపింగ్ సరిగ్గా లేకపోతే మనిషి ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. అయితే మీకు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఓ మంచి చిట్కాను నిపుణులు చెబుతున్నారు. అందేంటంటే మీ కాలి పాదాలను ఎప్పుడూ కదుపుతూ ఉండాలంట! అదేంటి కాలి పాదాలు కదుపుతూ ఉంటే గుండె ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.

పాదాలకు గుండెకు లింకేంటి?

మనలో చాలా మంది కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తుంటాం. అలాంటి వారు ఈ కథనం తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు తమ కాళ్లను ఎక్కువగా కదపరు. పాదాల్లోనూ కదలికలు ఉండవు. అలాంటప్పుడు రక్త ప్రసరణ సక్రమంగా పాదాల వరకూ చేరదు. దీని వల్ల కాళ్లు తిమ్మిర్లు రావడం, ఒక్కోసారి పట్టేయడం, కొద్ది సేపు స్పర్శ కోల్పోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణంగా గుండె నుంచి రక్త ప్రసరణ సక్రమంగా పాదాలకు చేరకపోవడమే. అందుకే పాదాలు తరచూ కదుపుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పాదాలను నిత్యం కదుపుతూ, జర్క్ ఇవ్వడం వంటివి చేయడం వల్ల గుండె నుంచి కిందకి మళ్లీ గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కార్డియో వాస్కులర్ వ్యాధి..

యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరి కొలంబియాకు చెందిన పరిశోధకులు 2016లో ఓ రిపోర్టు ఇచ్చారు. అదేంటంటే ఎక్కువ సేపు కూర్చొని పని చేసినా, లేక ప్రయాణాలు చేసినా కాళ్లలోకి రక్త ప్రసరణ తగ్గుతుందని, ఇది ఆ వ్యక్తి శరీరంలో కార్డియోవాస్కులర్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు.

ఇవి కూడా చదవండి

గుండె ఏ విధంగా డీఆక్సిజనేటెడ్(చెడు) రక్తాన్ని తీసుకొని, ఆక్సిజన్ తో కూడిన(మంచి) రక్తాన్ని శరీరం అంతా ప్రసరించేలా చేస్తుందో అదే రీతిగా కాలి పిక్క కండరాలు(కాఫ్ మజిల్స్) కూడా ఇదే తరహా పనితీరుని కనబరుస్తాయి. చెడు రక్తాన్ని కాళ్లనుంచి తీసుకొని గుండెకు పంపిణీ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాళ్లను లేదా పాదాలను ఎక్కువ సేపు కదలకుండా ఉంటే ఈ కాలి పిక్క కండరాలు సక్రమంగా పనిచేయవని, దీనివల్ల కాళ్ల నుంచి గుండెకు రక్తం సరఫరా సక్రమంగా జరగదని వివరిస్తున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇది డయాబెటిస్, హై బీపీ, స్పోకింగ్ అలవాటు ఉన్న వారిలో ప్రమాదాన్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు.

మరేం చేయాలంటే..

శరీరంలో గుండె ఆరోగ్యంగా ఉండి.. రక్తం సరఫరా బాగా జరగాలంటే మీ పాదాలను తరచూ కదుపుతూ.. పాదాలపై ఒత్తిడి పెడుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం 30 నుంచి 40 నిమిషాలకు ఒకసారి పాదాలకు పనిచెప్పాలని సూచిస్తున్నారు. దీంతో పాదాల నుంచి పైకి రక్త ప్రసరణ బాగా జరిగి కాళ్లు యాక్టివ్ గా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..