- Telugu News Photo Gallery DIY Aloe Vera Soap: A Step By Step Guide To Make Herbal Soap At Home Telugu news
వేసవిలో ఎక్కువ సార్లు స్నానం చేస్తున్నారా? చర్మ సంరక్షణ కోసం కలబందతో సబ్బు తయారు చేసుకోండి ఇలా..
సౌందర్య సాధనాల్లో కలబంద వాడకం అందరికీ తెలిసిందే. ఈ మూలికా పదార్ధం చాలా కాలంగా చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా కలబందను సబ్బుగా ప్రయత్నించారా?
Updated on: May 17, 2023 | 2:08 PM

సబ్బు తయారీ చిట్కాలు: వాణిజ్య సబ్బులలో క్షార, ఇతర రసాయనాలు ఉంటాయి. ఆల్కలీన్ సబ్బులు మన చర్మాన్ని పొడిగా, గరుకుగా మారుస్తాయి. ఇది చర్మం pH బ్యాలెన్స్, సహజ నూనెలను కూడా నాశనం చేస్తుంది. ఇంట్లో తయారుచేసుకునే అలోవెరా సోప్‌లో దుష్ప్రభావాల భయం ఉండదు.

కలబందలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. అలోవెరా జెల్ మొటిమల సమస్యలను తగ్గిస్తుంది, గాయాలను నయం చేస్తుంది అలాగే సన్ బర్న్ ను తొలగిస్తుంది మరియు చర్మాన్ని తేమగా చేస్తుంది.

అలోవెరా జెల్ ను ఎక్కువగా చర్మానికి ఉపయోగిస్తారు. ఇది చర్మంపై కలబందను ఉపయోగించడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం. అయితే కలబంద సబ్బును తయారు చేసి వాడితే అద్భుతమైన మార్పును గమనిస్తారు.

వాణిజ్య సబ్బులలో క్షార, ఇతర రసాయనాలు ఉంటాయి. ఆల్కలీన్ సబ్బులు మన చర్మాన్ని పొడిగా, గరుకుగా మారుస్తాయి. ఇది చర్మం pH బ్యాలెన్స, సహజ నూనెలను కూడా నాశనం చేస్తుంది. ఇంట్లో తయారుచేసుకునే అలోవెరా సోప్‌లో దుష్ప్రభావాల భయం ఉండదు.

కలబంద ఆకును కత్తిరించండి. కత్తిరించిన ఆ ముక్కలను పదిహేను నిమిషాల పాటు నీటిలో ఉంచాలి. కలబంద పసుపు రసం బయటకు వస్తుంది. ఇది హానికరం. తర్వాత ఆకులను ఒలిచి, చెంచా సహాయంతో జెల్‌ని బయటకు తీయాలి.

బాదం నూనె, కొబ్బరి నూనె, ఆముదంతో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఒక కప్పు నీటిలో 6-7 చెంచాల కాస్టిక్ సోడా కలపండి. బాగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం అంటుకోకుండా జాగ్రత్త వహించండి. తర్వాత అందులో అలోవెరా జెల్ మిశ్రమాన్ని కలపాలి.

బాదం నూనె, కొబ్బరి నూనె, ఆముదంతో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఒక కప్పు నీటిలో 6-7 చెంచాల కాస్టిక్ సోడా కలపండి. బాగా కలుపుతూ ఉండాలి. మిశ్రమం అంటుకోకుండా జాగ్రత్త వహించండి. తర్వాత అందులో అలోవెరా జెల్ మిశ్రమాన్ని కలపాలి.

కాస్టిక్ సోడా మిశ్రమానికి కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ కలపాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. మిశ్రమాన్ని సబ్బు అచ్చులో చల్లారనివ్వాలి.

ఒక గంట తర్వాత మీరు సబ్బు గట్టిపడటం చూస్తారు. ఈ సబ్బును ఎప్పుడూ ఈ అచ్చులోనే ఉంచండి. అవసరమైతే, మీరు దానిని డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు.




