Best Phones Under 25K: ఈ ఫోన్లు మార్కెట్లో హాట్ కేక్‌లు.. అనువైన ధర.. మంచి పనితీరు.. టాప్ ఫీచర్లు..

మీరు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా ధర రూ. 25,000లోపు ఉండాలని ఆలోచిస్తున్నారా? ఈ ధరలోనే స్టైలిష్ డిజైన్, యునిక్ ఫీచర్లు ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్లు అది కూడా మీకు కావాల్సిన రేంజ్ లో ఉన్న ఫోన్ల జాబితా ఇక్కడ ఇచ్చాం. మీరూ ఓ లుక్కేయండి.

Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Apr 12, 2024 | 10:04 PM

శామ్సంగ్ గేలాక్సీ ఏ23 5జీ(Samsung Galaxy A23 5G).. శామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్లు డిజైన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంజీ అల్ట్రా వైడ్ లెన్స్, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి. దీని ధర రూ.  24,999 నుంచి ప్రారంభమవుతుంది.

1 / 6
రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ(Redmi Note 12 Pro 5G).. అధిక సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ జిప్పీ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో ప్రధాన ఎట్రాక్షన్ ఏంటంటే కెమెరా. వెనుకవైపు తక్కువ కాంతిలో అత్యద్భుత పిక్చర్ క్వాలిటీ అందించే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన  సోనీ ఐఎంఎక్స్ 766 50మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000 mAh కాగా  67W ఇన్-బాక్స్ ఫాస్ట్ ఛార్జర్ 15 నిమిషాలలో ఒక రోజుకు సరిపడా చార్జింగ్ ను అందిస్తుంది. దీని ధర రూ. 24,999 నుంచి ప్రారంభం అవుతుంది. (Image Credit: Redmi)

2 / 6
మోటరోలా ఎడ్జ్ 30(Motorola Edge 30).. అత్యంత స్లిమ్ లుక్ లో ఈ ఫోన్ ఉంటుంది. కేవలం 6.79 మిమీ మందంతో చాలా తేలికగా ఉంటుంది. దీని బరువు మీ వ్యాలెట్ కంటే తేలికగా ఉంటుంది. దీనిలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే (2400 x 1080 పిక్సెల్‌లు) ఉంటుంది. వెనుక కెమెరా ప్రత్యేకమైన 50ఎంపీ అల్ట్రా-వైడ్ + మాక్రో క్యామ్, 50ఎంపీ ఐఓఎస్ ప్రైమరీ లెన్స్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.  23,999 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 6
వివో వై100(Vivo Y100).. ఈ ఫోన్ పెద్ద ఊసరవెల్లి లాంటిది. ఇది రంగులు మార్చుకుంటుంది. అందుకోసం ఈ ఫోన్ వెనుకవైపు ఏజీ గ్లాస్ బ్యాక్ ఉంటుంది. దీనిలో ట్రిలైట్ గోల్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆరెంజ్ నుంచి మెటాలిక్ గోల్డ్  వరకూ బయట లైటింగ్ ఆధారంగా తనని తాను మార్చుకుంటుంది. దీనిలో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట ఉంటుంది. దీనిలో వెనుక వైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. దీని ధర రూ. 24,999గా ఉంది.

4 / 6
ఒప్పో ఎఫ్12ఎస్ ప్రో(OPPO F21S Pro).. ఇది డాన్ లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో ఉంటుంది. ఒప్పో ఈ ఫోన్ ని ఒప్పో గ్లో అని పిలుస్తుంది. అలాగే స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిలో 2ఎంపీ మైక్రోస్కోపిక్ లెన్స్‌తో  పాటు 64ఎంపీ ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. దీని ధర రూ. 21,999గా ఉంటుంది.

5 / 6
పోకో ఎక్స్ 5(POCO X5 Pro)..
ఇది ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తుంది. ఇది ఫ్రాస్టెడ్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రో  778జీ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది రెండు ఎంపికలలో వస్తుంది - 6GB/128GB లేదా 8GB/256GB. 120Hz రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది.

పోకో ఎక్స్ 5(POCO X5 Pro).. ఇది ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో వస్తుంది. ఇది ఫ్రాస్టెడ్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రో 778జీ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది రెండు ఎంపికలలో వస్తుంది - 6GB/128GB లేదా 8GB/256GB. 120Hz రిఫ్రెష్ రేట్ 6.67-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీని ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది.

6 / 6
Follow us