AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో ఎనర్జీ ఫుల్‌గా ఉండాలంటే రోజూ ఈ నీళ్లు తాగాల్సిందే

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం అలసటకు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహజమైన మార్గాల్లో బెల్లం నీళ్లు అద్భుత ఫలితాలు ఇస్తాయి. ఇది డీహైడ్రేషన్ నివారణ, జీర్ణక్రియ మెరుగుదల, చర్మ ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

ఎండాకాలంలో ఎనర్జీ ఫుల్‌గా ఉండాలంటే రోజూ ఈ నీళ్లు తాగాల్సిందే
Jaggery Water Benefits
Prashanthi V
|

Updated on: May 01, 2025 | 5:03 PM

Share

వేసవిలో అధిక వేడి వల్ల శరీరం అలసటకు గురవుతుంది. శరీరం చల్లగా ఉండాలి అంటే కొన్ని సహజమైన మార్గాలు చాలా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడే వాటిల్లో ఒకటి బెల్లం నీళ్లు. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరానికి చల్లదనం అంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లం నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బెల్లం నీళ్లు తాగితే తేలికగా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. తలనొప్పులు, అలసట తగ్గిపోతాయి.

వేసవిలో బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. నిగారింపు పెరుగుతుంది. స్కిన్ గ్లో కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం నీళ్లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలసట లేకుండా శక్తిగా ఉంటారు. మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

వేసవిలో ఎక్కువ చెమట వల్ల శరీరంలోని నీరు పోయే అవకాశం ఉంటుంది. బెల్లం నీళ్లు తాగితే శరీరానికి మళ్లీ ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. దీనివల్ల డీహైడ్రేషన్ రాదు. వేసవిలో ఇది ముఖ్యమైన లాభం.

బెల్లం నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలంగా చేస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. రోజూ తాగితే శరీరం తేలికగా ఉంటుంది.

వేసవిలో చాలా మందికి హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది వడదెబ్బ నుంచి కాపాడుతుంది. తల తిరుగుడు, నీరసం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

బెల్లం నీళ్లు లివర్‌ను శుభ్రంగా ఉంచుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. దీని వలన కాలేయ సంబంధిత సమస్యలు తక్కువవుతాయి. శరీరంలో ఉండే హానికర పదార్థాలు బయటకు పోతాయి.

బెల్లం నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో తిన్న ఆహారం జీర్ణం కావడం కాస్త కష్టంగా ఉంటుంది. అప్పుడు బెల్లం నీళ్లు తాగితే కడుపు బాగా పని చేస్తుంది. ఉబ్బసం తగ్గుతుంది. గట్ ఆరోగ్యం మెరుగవుతుంది.

వేసవిలో తేలికగా అలసిపోవడం సాధారణం. బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. బలహీనత, నీరసం ఉండదు. పని చేసే శక్తి పెరుగుతుంది. రోజూవారీ జీవితంలో శక్తివంతంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..