Meditation: ధ్యానం చేసే సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది..? ఎలాంటి మార్పులుంటాయి.. పరిశోధనలో కీలక విషయాలు

Meditation: ధ్యానం మనస్సుకు విశ్రాంతతనిస్తుంది. ధ్యానం ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు హృదయం నుండి మనస్సుకు ఎంత మార్పు..

Meditation: ధ్యానం చేసే సమయంలో శరీరంలో ఏం జరుగుతుంది..? ఎలాంటి మార్పులుంటాయి.. పరిశోధనలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 24, 2022 | 8:39 AM

Meditation: ధ్యానం మనస్సుకు విశ్రాంతతనిస్తుంది. ధ్యానం ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు హృదయం నుండి మనస్సుకు ఎంత మార్పు జరుగుతుందో తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు (Researches) జరిగాయి. ఇది పరిశోధనలో కూడా నిర్ధారించబడింది. సైన్స్ ఫోకస్ నివేదిక (Science Focus Report ) ప్రకారం.. ధ్యానం మెదడుపై అనేక విధాలుగా ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తిని రిలాక్స్‌గా అయ్యేలా చేస్తుంది. గుండె (Heart)పై ధ్యానం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించాడరు. రెగ్యులర్ మెడిటేషన్ వల్ల పెరిగిన రక్తపోటు నార్మల్‌గా మారుతుందని పరిశోధనలో వెల్లడైంది. హైబీపీ (High Blood Pressure)తో బాధపడే వారు ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు కోపం కూడా తగ్గుతుంది. భావోద్వేగాలు, భయం, కోపాన్ని నియంత్రించే ఒక భాగం మెదడులో ఉందని నివేదిక చెబుతోంది. ఒక వ్యక్తి ధ్యానం చేసినప్పుడు ఈ భాగం చురుగ్గా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడిని నుంచి దూరమై ప్రశాతంగా ఉండేలా చేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

ధ్యానం ప్రభావం కడుపుపై కూడా కనిపించింది.పెద్దపేగుకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ధ్యానం వల్ల శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఫలితంగా, దాని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. ధ్యానం ప్రభావం నొప్పిపై కూడా కనిపించింది. మెడిటేషన్ చేసిన తర్వాత కండరాలు రిలాక్స్ అవుతాయని నివేదిక చెబుతోంది. ఫలితంగా నడుము నొప్పి తగ్గుతుంది. అందువల్ల పెయిన్ కిల్లర్లను కూడా నివారించవచ్చు. ధ్యానం వల్ల ఏదైనా నొప్పి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇది కాకుండా శారీరక గాయాలలో రికవరీ వేగంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Hypothyroid: మీకు హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాలను తీసుకోండి

Elbow: మోచేయికి దెబ్బ తగిలినప్పుడు కరెంట్ షాక్‌లా ఎందుకు ఉంటుంది..? కారణం ఏమిటి?