Fenugreek: మెంతులతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్.. బాలింతల్లో పాలు ఉత్పత్తి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు
ఓవెర్ వెయిట్ అన్నది ఇప్పుడు మనుషులకు ప్రధాన సమస్యగా మారింది. తీసుకునే ఆహారంలో మార్పులతో కొందరు ఊహించని విధంగా బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Health Benefits of Fenugreek: ఓవెర్ వెయిట్ అన్నది ఇప్పుడు మనుషులకు ప్రధాన సమస్యగా మారింది. తీసుకునే ఆహారంలో మార్పులతో కొందరు ఊహించని విధంగా బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గంటల తరబడి జిమ్స్‌లో వ్యాయామం చేస్తున్నారు. మరికొందరు కఠినమైన డైట్స్ ఫాలో అవుతున్నారు. కొందరికి ఇవి హెల్ఫ్ అయినా.. మరికొందరికి మాత్రం నో యూజ్. అయితే కొన్ని వంటింటి చిట్కాలు వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. అందులో మెంతులు ఒకటి. మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు క్రమక్రమంగా తగ్గవచ్చు. మెంతుల్లో ఫైబర్(Fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్(Diabetes) రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
- బరువు తగ్గడానికి.. ఉదయం పరిగడుపున మెంతి నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో కొన్ని మెంతి గింజలు వేసి నానా బెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. లేకపోతే.. మెంతులను నీటిలో మరిగించి తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది. ఈ పానీయంలో జీరో కేలరీలే ఉంటాయి.
- మెంతులు తింటే.. మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
- తక్కువ కేలరీల టీ తాగాలనుకుంటే మెంతి టీ ఉత్తమం. ఈ టీ ప్రత్యేకత ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ (బొడ్డు చుట్టూ కొవ్వు) ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- బరువు తగ్గడానికి మెంతుల్లో తేనె కూడా వాడవచ్చు. తేనె రోగనిరోధక శక్తిని పెంచేది. కావున మెంతులను నీటిలో మరిగించి.. తేనె కలిపి తాగవచ్చు. వాటికి కొంచెం నిమ్మరసం జోడిస్తే.. హెర్బల్ టీ లాగా అవుతుంది.
- జట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలకు మెంతులతో పరిష్కారం లభిస్తుంది. ఇది బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది.
- ఉబ్బసం, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి
- మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల పట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Also Read: ఈ ఫోటోలో ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు.. ఎవరో గుర్తించారా..?
తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?