Jaggery: మహిళలకు గమనిక.. ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే..?

Jaggery Benfits: మహిళలకి జీవితంలో గర్భం దాల్చడం కూడా ఒక అందమైన అనుభూతి. ఆ సమయంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Jaggery: మహిళలకు గమనిక.. ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే..?
Jaggery
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2022 | 10:39 AM

Jaggery Benfits: మహిళలకి జీవితంలో గర్భం దాల్చడం కూడా ఒక అందమైన అనుభూతి. ఆ సమయంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వాటన్నింటిని ఇష్టంగా భరిస్తారు. చివరకి బిడ్డ తల్లి ఒడిలోకి వస్తే పడిన కష్టాలన్ని మరిచిపోతారు. అయితే గర్భం దాల్చినప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు బెల్లం తినాలి. ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. బెల్లం హార్మోన్ల అసమతుల్యతను పరిష్కరించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అన్నింటిలో ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన రక్త కణాల పెరుగుదలలో బెల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది చక్కెర కంటే మెరుగైనది. షుగర్ పేషెంట్లు కూడా బెల్లం తీసుకోవచ్చు. బెల్లంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి. రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

1. రోగనిరోధక శక్తి పెంచుతుంది

రోగనిరోధక శక్తి సరిగా లేని వారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భధారణ సమయంలో బెల్లం తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. బెల్లంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతాయి.

2. జీర్ణశక్తి మెరుగుపడుతుంది

గర్భధారణ సమయంలో మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. వెంటనే బెల్లం తినాలి. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

3. నీటి నష్టాన్ని నివారిస్తుంది

గర్భధారణ సమయంలో శరీరంలో నీరు ఎక్కువగ అవసరం. ఈ సందర్భంలో బెల్లం మీకు సహాయం చేస్తుంది. బెల్లం పొటాషియం, సోడియం మితమైన మొత్తంలో కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రోలైట్‌లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.

4. బెల్లం ఎప్పుడు తినాలి

గర్భం దాల్చిన మొదటి రెండు నెలల్లో తల్లికి ఐరన్ ఎక్కువగా అవసరం. ఈ సమయంలో రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఐరన్ అవసరాన్ని చూసి గర్భిణీలు బెల్లం తినడం ప్రారంభించవచ్చు. అయితే మొదటి మూడు నెలల్లో ఐరన్ నోటి రూపంలో తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే ఇది వాంతులు కూడా కలిగిస్తుంది. దీన్ని తినడం ప్రారంభించే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించండి.

Breakup: లవ్‌లో ఫెయిల్‌ అయిన అబ్బాయిలు ఈ పనులే ఎక్కువగా చేస్తున్నారట..!

Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!

Moles Meaning: శరీరంలో ఆ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు గొప్ప ప్రేమికులట..!