Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!

Mileage Bikes: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Mileage Bikes: సామాన్యుడి బతుకుబండి నడిపిస్తున్న 4 బైక్‌లు.. ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!
Mileage Bikes
Follow us
uppula Raju

|

Updated on: Feb 24, 2022 | 9:54 AM

Mileage Bikes: గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీదకి వాహనాలు తీసుకురావాలంటే జంకుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల రాక రోజు రోజుకి ఆలస్యం అవుతుంది. ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిలో ఈ నాలుగు బైక్‌లు మాత్రమే సామాన్యుడి బతుకు బండి నడుపుతున్నాయి. లీటర్‌ పెట్రోల్‌కి అధిక మైలేజ్‌ ఇస్తూ ఎంతో కొంత ఆసరాగా ఉంటున్నాయి. ధర కూడా తక్కువగా ఉండటంతో చాలామంది వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అందులో బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా మొదటి స్థానంలో ఉంది. బజాజ్ ప్లాటినా 100 సీసీ అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి. దీనిని 2005లోనే ప్రారంభించారు. ఈ బైక్ కిక్-స్టార్ట్, ఎలక్ట్రిక్-స్టార్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,861, దీని టాప్ వేరియెంట్‌ రూ. 63,541 వరకు ఉంటుంది. బైక్‌కి 102 సిసి ఇంజన్ అమర్చారు. 1 లీటర్ పెట్రోల్‌కి ఈ బైక్‌ 90 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ఇండియన్ మార్కెట్లో నెంబర్‌ వన్ బైక్‌. అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌. ఇది 5 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ 8.36 PS పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 97.2 cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్‌ 1 లీటర్ పెట్రోల్‌కి 82.9 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ముంబైలో రూ.52,040 నుంచి మొదలై రూ.62,903 వరకు ఉంది. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, హెడ్‌లైట్ ఆన్ వంటి ఫీచర్లు అందించారు.

బజాజ్ CT 100

బజాజ్‌ CT 100 అనేది ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో వస్తున్న మరో చౌకైన బైక్. ముంబైలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,510 దీని టాప్ మోడల్‌కు రూ. 60941 వరకు ఉంటుంది. ఈ బైక్‌ను రూ.50,000 లోపు అత్యుత్తమ బడ్జెట్ బైక్‌గా చెప్పవచ్చు. దీనికి 102 సిసి ఇంజన్ అమర్చారు. ఒక లీటర్ పెట్రోల్‌కి ఈ బైక్‌ 90 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

TVS స్పోర్ట్

TVS స్పోర్ట్ మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ బైక్. ఇది 7.8 PS పవర్, 7.5 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 99.7 cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. బైక్ ముందు భాగం టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో, వెనుక భాగం ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ బైక్‌ను 1 లీటర్ పెట్రోల్‌కి 75 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ముంబైలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 57,967 నుంచి మొదలై రూ. 63,176 వరకు ఉంటుంది.

Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి

Maruti Suzuki: మారుతి బాలెనో కొత్త మోడల్‌ అదుర్స్‌.. చిప్‌ల సరఫరాతో విక్రయాల్లో మరింత ఊపు: CEO

Banana Peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో ఎన్నో లాభాలు ఉన్నాయి.. అవి ఏంటంటే..