Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి

నోటి పూతనే.. నోటి అల్స‌ర్ అని కూడా అంటారు. ఈ ఇబ్బందిని చాలామంది ఎదుర్కొంటారు. నోటి పూత వస్తే  ఆ బాధ వ‌ర్ణించ వీలులేనిది. ఫుడ్ తినడానికి ఇబ్బంది ఎదురవుతుంది.

Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి
Mouth Ulcers
Follow us

|

Updated on: Feb 24, 2022 | 7:44 AM

Health Tips: నోటి పూతనే.. నోటి అల్స‌ర్ అని కూడా అంటారు. ఈ ఇబ్బందిని చాలామంది ఎదుర్కొంటారు. నోటి పూత వస్తే  ఆ బాధ వ‌ర్ణించ వీలులేనిది. ఫుడ్ తినడానికి ఇబ్బంది ఎదురవుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే మంచినీళ్లు తాగాలన్నా సమస్యే. ఇక మార్నింగ్ బ్రష్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.  ఈ పుండ్లు నోటిలో పెదాల కింద, బుగ్గల భాగంలో, నాలుకపై ఇలా ప్రతీ చోట వస్తుంటాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఒంట్లోని వేడి. అయితే నోటి పూతకు ఇంట్లో దొరికే కొన్ని ఆహార ప‌దార్థాల‌తోనే చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం పదండి.

  1. నోటిలో పుండ్లు అయిన చోట కొబ్బ‌రి నూనెను రాయ‌డం వల్ల మంట తగ్గి స్వాంతన క‌లుగుతుంది. దీంతోపాటు పుండ్ల వల్ల కలిగే వాపు కూడా తగ్గుతుంది. ఎండు కొబ్బ‌రిని న‌మిలినా ఫ‌లితం ఉంటుందని పేర్కొంటున్నారు. కొబ్బ‌రి నీళ్లు తాగినా కూడా అల్స‌ర్ల స‌మ‌స్య నుంచి బయటపడొచ్చు.
  2. వెల్లుల్లి యాంటిబయోటిక్‌గా పనిచేస్తుందని మనందరికీ తెలుసు.. వెల్లుల్లి నోటిపూతను తొందరగా తగ్గిస్తుంది. వెల్లుల్లిలోని శక్తివంతమైన అల్లిసిన్ నొప్పిని తగ్గించడంతోపాటు నోటి పుండ్లను అరికడుతుంది. కొంచెం వెల్లుల్లి పేస్ట్ తీసుకోని పూత పై భాగంలో 10-20 నిమిషాల పాటు ఉంచితే.. ఉపశమనం కలుగుతుంది.
  3.  తేనె నోటి అల్సర్లను తగ్గించడంతో బాగా పనిచేస్తుంది. తేనెలో ఉండే.. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటి పూతను నయం చేయడంలో మంచిగా పనిచేస్తాయి. అల్సర్లు అయిన చోట తేనె పూస్తే.. ఆ ప్రాంతంలో తేమగా మారి రిలీఫ్ ఉంటుంది.
  4. నోటి పూతను ఆపిల్ సైడర్ వెనిగర్ తొందరగా.. అరికడుతుంది. దీనిద్వారా నోటి పుండ్లు వెంటనే నయమవుతాయి. ఇది అల్సర్లకు కారణమయ్యే సూక్ష్మక్రిములను చంపేస్తుంది. కావున మూడు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను కొంచెం నీటిలో వేసి.. 30 సెకన్ల పాటు నోటిలో ఉంచి గార్గింగ్ చేయాలి. దీంతో నోటి పూత నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు.
  5. నోటిపూతను తగ్గించడంలో ఉప్పునీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. నోటి పూతలను నయం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఉప్పునీటి పుక్కిలించడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు

తెల్ల వెంట్రుకలను పీకేస్తే… అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?