Health Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హెర్బల్‌ టీని ట్రై చేయండి..

Black Pepper Tea: వంటకాలకు రుచితో పాటు సువాసనను అందిస్తాయి నల్ల మిరియాలు. అందుకే వీటిని పలు రకాల వంటకాల్లో భాగంగా ఉపయోగిస్తారు.

Health Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హెర్బల్‌ టీని ట్రై చేయండి..
Black Pepper Tea
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2022 | 9:34 AM

Black Pepper Tea: వంటకాలకు రుచితో పాటు సువాసనను అందిస్తాయి నల్ల మిరియాలు. అందుకే వీటిని పలు రకాల వంటకాల్లో భాగంగా ఉపయోగిస్తారు. ప్రతివంటగదిలో ఉండే ఈ సుగంధ ద్రవ్యంలో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ముఖ్యంగా నల్లమిరియాల టీ (బ్లాక్‌ పెప్పర్‌ టీ) శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించి బరువును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. పైగా దీనిని అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బ్లాక్‌ పెప్పర్‌ టీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి.

బ్లాక్‌ పెప్పర్‌ టీ ఎలా తయారుచేయాలంటే..

ఈ టీ చేయడానికి 2 కప్పుల నీరు, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తరిగిన అల్లం అవసరం. దీని కోసం, ముందుగా ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి. అన్ని పదార్థాలను బాణలిలో వేసి తక్కువ మంటపై మరిగించాలి. ఇలా సుమారు 3 నుంచి 5 నిమిషాలు మరిగించిన తర్వాత తియ్యదనం కోసం కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు.

బరువు తగ్గడంలో..

బ్లాక్‌ పెప్పర్‌ టీ బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఇందులో థర్మోజెనిక్ ఏజెంట్లు జీవక్రియ రేటును వేగవంతం చేస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అదేవిధంగా శరీరంలోని కొవ్వులను కరిగిస్తాయి. రోజూ కనీసం ఒకసారైనా బ్లాక్ పెప్పర్ టీ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

ఇమ్యూనిటీని  పెంచుతుంది..

నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నల్ల మిరియాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.

ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది..

సీజనల్‌ మార్పుల కారణంగా కలిగే జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో బ్లాక్‌ పెప్పర్‌ టీ ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆస్తమాతో బాధపడేవారికి కూడా ఇది ఉత్తమ పానీయం.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది..

బ్లాక్ పెప్పర్ టీ తీసుకోవడం వల్ల శరీరంలోని విషుతుల్య పదార్థాలు (ట్యాక్సిన్లు) బయటకు వస్తాయి. అదేవిధంగా శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతాయి. అదేవిధంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.