Maruti Suzuki: మారుతి బాలెనో కొత్త మోడల్ అదుర్స్.. చిప్‌ల సరఫరాతో విక్రయాల్లో మరింత ఊపు: CEO
Maruti Suzuki: దేశంలోని ప్రముఖ కార్ కంపెనీ మారుతీ సుజుకి ఇండియాకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. రాబోయే కాలంలో సెమీకండక్టర్ (Semiconductor) సరఫరా..
Maruti Suzuki: దేశంలోని ప్రముఖ కార్ కంపెనీ మారుతీ సుజుకి ఇండియాకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. రాబోయే కాలంలో సెమీకండక్టర్ (Semiconductor) సరఫరా మెరుగుపడటంతో వాహనాల అమ్మకాలు మెరుగుపడతాయని అంచనా వేస్తోంది. కొత్త బాలెనో (Baleno) విడుదల సందర్భంగా మారుతి సుజుకి డైరెక్టర్, CEO కెనిచి అయుకవా మాట్లాడుతూ.. చిప్‌ల సరఫరా తగినంతగా ఉంటే కంపెనీ 2018-19లో సాధించిన అమ్మకాల స్థాయిని కూడా చేరుకోగలదని అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 18.62 లక్షల వాహనాలను విక్రయించింది. 2021 ఏప్రిల్-2022 జనవరి మధ్య కంపెనీ 13.18 లక్షల యూనిట్లను విక్రయించింది.
చిప్‌ల కొరత అమ్మకాలపై ప్రభావం..
కోవిడ్ -19 మహమ్మారి, తదుపరి చిప్ కొరత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల కారణంగా కంపెనీ అమ్మకాలు గత సంవత్సరం క్షీణించాయని అయుకావా చెప్పారు. పరిస్థితి మెరుగుపడితే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను పెంచుకోవచ్చని తెలిపారు. మేము మార్కెట్‌కు మంచి పరిమాణంలో ఉత్పత్తులను అందించగలము అని అన్నారు. తగినంత పరిమాణంలో విడిభాగాలను పొందినట్లయితే 2018-19 అమ్మకాల గణాంకాలను సులభంగా దాటేస్తామని అన్నారు. హర్యానాలోని కంపెనీ కొత్త ప్లాంట్‌పై ప్రాజెక్ట్‌కు ఇంకా తుది అనుమతి రాలేదని అయుకవా చెప్పారు.
కొత్త బాలెనో..
మరోవైపు మారుతీ సుజుకి ఇండియా (MSI) బుధవారం తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వాహనం ‘బాలెనో’ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త మోడల్ బాలెనో మాన్యువల్ వెర్షన్‌ల ధర రూ.6.35 లక్షల నుంచి రూ.8.99 లక్షల వరకు ఉంది. అదే సమయంలో ఆటోమేటిక్ వెర్షన్ల ధర రూ.7.69 లక్షల నుంచి రూ.9.49 లక్షల రేంజ్‌లో నిర్ణయించబడింది. ఈ కార్ల తయారీకి దాదాపు రూ.1,150 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అయుకవా తెలిపారు. ఇందులో ప్రీమియం ఇంటీరియర్స్‌తో పాటు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాలెనోకి ఉన్న ఆదరణ, కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మోడల్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశించిబడి ఉందని అన్నారు. కొత్త శకం బాలెనో కొత్త భవిష్యత్తు కోసం మన దృష్టిని ప్రతిబింబిస్తుంది. బాలెనో మొదటిసారి అక్టోబర్ 2015లో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలో బాగా నచ్చింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐదు మోడళ్లలో బాలెనో చేరింది. కొత్త మోడల్ బాలెనో కోసం ఇప్పటివరకు దాదాపు 25,000 బుకింగ్‌లు జరిగాయని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ఇవి కూడా చదవండి: