Indian Railway: థర్డ్‌ ఏసీ, ఎసీ-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటి..? ఈ కోచ్‌లు ఇతర వాటికి భిన్నంగా ఎందుకుంటాయి..?

Indian Railway: భారతీయ రైల్వే (Indian Railway) శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికుల మెరుగైన ప్రయాణం కోసం రైల్వే ప్రత్యేక రైళ్లను..

Indian Railway: థర్డ్‌ ఏసీ, ఎసీ-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటి..? ఈ కోచ్‌లు ఇతర వాటికి భిన్నంగా ఎందుకుంటాయి..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 24, 2022 | 8:14 AM

Indian Railway: భారతీయ రైల్వే (Indian Railway) శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికుల మెరుగైన ప్రయాణం కోసం రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందు కోసం రైలులో వివిధ కోచ్‌లను తయారు చేస్తారు. అందులో మీరు సౌకర్యాలు, ఆర్థిక స్థితికి అనుగుణంగా కోచ్‌ను ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ బుకింగ్‌ నుంచి రైల్వే కోచ్‌ల వరకు మెరుగైన సేవలు అందిస్తోంది భారతీయ రైల్వేశాఖ. భారతీయ రైల్వేలో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. మెరుగైన ప్రయాణం సాగించేందుకు కోచ్‌ (Coache)లలో అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ (Railway Department). ప్రయాణికులకు అనుగుణంగా సదుపాయాలు ఉంటాయి. ఇందుకోసం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ వంటి కోచ్‌లు ఉండగా, ఇప్పుడు చాలా రైళ్లలో థర్డ్ ఏసీ (Third AC) తరహాలో ఏసీ-3 ఎకానమీ (AC 3 Economy) కోచ్‌లు కూడా ఉంటున్నాయి.

AC-3 ఎకానమీ అంటే ఏమిటి?

థర్డ్ ఏసీలో ఉన్నట్లు ఇందులో కూడా అవే కోచ్‌లు ఉంటాయి. థర్డ్ ఏసీలో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో ఈ కోచ్‌లోనూ అదే సౌకర్యాలు కల్పిస్తున్నారు. AC3 కోచ్‌లు ఉన్న రైలులో ఎకానమీ కోచ్‌లు లేవు, అంటే ఒక విధంగా థర్డ్ ఏసీతో సమానంగా ఉంటుందన్నట్లు. అయితే ఇది థర్డ్ ఏసీకి కొంత భిన్నంగా ఉంటుంది? స్తవానికి AC-3 కొత్త కోచ్‌లకు AC3 ఎకానమీ అనే పేరు పెట్టారు. థర్డ్ ఏసీలో 72 సీట్లు ఉన్నా, ఏసీ-3 ఎకానమీలో 11 సీట్లు ఎక్కువగా అంటే 83 సీట్లు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన కోచ్‌లు. వీటిలో ప్రజలు ఎక్కువ ప్రయాణించే విధంగా, వారికి మెరుగైన సౌకర్యాలు కూడా లభించే విధంగా రూపొందించబడ్డాయి. ఈ కోచ్‌ల ఇంటీరియర్ మునుపటి కంటే మెరుగ్గా ఉండడంతో పాటు ప్రతి ప్రయాణికుడు ఏసీ ప్రయోజనం పొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పాటు కోచ్‌లోని ప్రతి వ్యక్తికి అనుగుణంగా లైట్ల ఏర్పాటు తదితరాలు చేశారు.

థర్డ్ ఏసీ కోచ్‌లను సాధారణంగా బి1, బి2, బి3 మొదలైన వాటితో గుర్తించినట్లుగానే ఎకానమీ కోచ్‌లను ఎం1, ఎమ్2, ఎమ్3 మొదలైన వాటితో గుర్తిస్తారు. ఇప్పుడు ఈ కోచ్‌లు చాలా రైళ్లలో అమర్చబడ్డాయి.

ఇవి కూడా చదవండి:

Railway Crossing: రైల్వే ట్రాక్‌లపై W/L అనే బోర్డు ఎందుకు ఉంటుంది.. పూర్తి వివరాలు

Fact Check: మీ స్థలంలో 5G, 4G టవర్స్‌ ఏర్పాటు చేస్తామంటూ మొబైళ్లకు మెసేజ్‌లు వస్తున్నాయా? ఇందులో నిజమెంత..?

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?