Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: మీ స్థలంలో 5G, 4G టవర్స్‌ ఏర్పాటు చేస్తామంటూ మొబైళ్లకు మెసేజ్‌లు వస్తున్నాయా? ఇందులో నిజమెంత..?

Fact Check: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ నంబర్లకు సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లను పంపుతూ పూర్తి వివరాలు సేకరించి బ్యాంకుల్లో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు..

Fact Check: మీ స్థలంలో 5G, 4G టవర్స్‌ ఏర్పాటు చేస్తామంటూ మొబైళ్లకు మెసేజ్‌లు వస్తున్నాయా? ఇందులో నిజమెంత..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 23, 2022 | 8:37 PM

Fact Check: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ నంబర్లకు సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లను పంపుతూ పూర్తి వివరాలు సేకరించి బ్యాంకుల్లో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు. లేనిపోని లింక్‌లను పెడుతూ ప్రజలు ఈ లింక్‌ను ఓపెన్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసిపోతాయి. దీంతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలపై ఇప్పటికే పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఇక మీ మొబైల్‌ నెంబర్‌కు 5జీ,4జీ టవర్స్‌ (5G/4G Tower Installation) ఇస్టాలేషన్‌కు సంబంధించి మెసేజ్‌లు వచ్చినట్లయితే వాటిని స్వీకరించకపోవడం మంచిది. టవర్స్‌ ఇన్‌స్టాలేషన్‌ చేస్తామని, అందుకు మీరు కొంత డబ్బులు చెల్లిస్తే మీకు నెలనెల అద్దె రూపంలో చెల్లిస్తామని మెయిల్స్‌ కొందరు పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్‌ల లింక్‌లను క్లిక్‌ చేసినట్లయితే నిలువునా మోసపోవాల్సి వస్తుంది. ఇలాంటి సందేశాల (Message)పై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ (PIB Fact Check) క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దని, వచ్చిన సందేశాలను నమ్మినట్లయితే మీరు నిలువునా మోసపోవాల్సి వస్తుందని తెలిపింది.

కొంత మంది మోసగాళ్లు కంపెనీలు, ఏజెన్సీల పేరుతో సామాన్య ప్రజలను వారి ప్రాపర్టీలో మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు సందేశాలు పంపుతున్నారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్‌, దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్‌ ఫీజులను కంపెనీ ఖాతాలో జమ చేయాలని ఇస్తే నెలవారీగా మీకు అద్దె చెల్లిస్తామంటూ మోసం చేస్తున్నారని, ఇలాంటివి నమ్మ వద్దని PIB సూచిస్తోంది. ఇలా టవర్స్‌ ఏర్పాటు చేయాలని ఎంతో ప్రాసెస్‌ ఉంటుంది.

మొబైల్‌ టవర్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి, అలాగే నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ జారీ చేయడానికి స్థలాన్ని లీజుకు, అద్దెకు ఇవ్వడంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనదు.

టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌, ఇన్‌ప్రాస్టక్చర్‌ ప్రొవైడర్‌ వారి లైసెన్సింగ్‌ రిజిస్ట్రేషన్‌ షరతుల ప్రకారం మొబైల్‌ టవర్‌లను ఇన్‌స్టాలేషన్‌ చేసుకోవచ్చు. అయితే టవర్‌లను ఏర్పాటు చేసేందుకు ముందస్తుగా సదరు కంపెనీ గానీ, ఏజన్సీ గానీ అడ్వాన్స్‌గా డబ్బులు అడగడం, దరఖాస్తుల కోసం ఫీజు అడగడం లాంటివి చేస్తే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడినట్లయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Google: ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ప్రైవసీ విషయాలో భారీ మార్పులు..!

RBI: అప్రమత్తంగా ఉండండి.. ఈ యాప్‌ వాడేవారికి రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరిక..!