OTT Movie: ఏం సినిమారా బాబు .. చూస్తే మెంటలెక్కిపొతుంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లిష్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే. హాలీవుడ్ లో ఉన్న పలు పాపులర్ ఫ్రాంచైజ్, సిరీస్ లలో ఇది కూడా ఒకటి.

ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అలరిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలకు ఎక్కువ క్రేజ్ ఉంది. సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాల కంటే ఇప్పుడు ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడియన్స్. భయపడతామని తెలిసి కూడా థ్రిల్లర్ సినిమాలు చూస్తున్నారు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ సినిమా చూడండి. అదే ది ఎక్సార్సిస్ట్. ఇది1973లో వచ్చిన అమెరికన్ హాలీవుడ్ సినిమా. దర్శకుడు విలియం ఫ్రైడ్కిన్ దర్శకత్వం వహించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం .70ల నాటి ఈ చిత్రం ఇప్పటికీ నంబర్ 1 థ్రిల్లర్ చిత్రం ఇదే.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
విలియం పీటర్ బ్లాటీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కొత్త ఇంటికి మారిన ఓ కుటుంబానికి అక్కడ ఎదురైన పరిస్థితులు.. ఆ ఇంట్లో ఓ పిల్లవాడు వింతగా మారడం అతడి తల్లి గమనిస్తుంది. చిన్నారి పరిస్థితి రోజురోజుకు మారిపోవడం, మనిషి రూపురేఖలకు భిన్నంగా మారడం గమనించిన తల్లి ఓ క్రైస్తవ మతగురువును సంప్రదించడంతో ఆ చిన్నారికి పట్టిన దెయ్యం గురించి తెలుస్తుంది. ది ఎక్సార్సిస్ట్ అనేది చాలా భయానక థ్రిల్లర్ మూవీ.
ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ
ఒక తల్లి తన బిడ్డను దెయ్యం నుండి రక్షించుకోవడానికి చేసే పోరాటామే ఈ మూవీ. సీన్ సీన్ కు తడిసిపోవడం ఖాయం. ఈ చిత్రం ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా తదుపరి భాగం ది ఎక్సార్సిస్ట్ బిలీవర్, 2022లో విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడం మంచిది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




