RBI: అప్రమత్తంగా ఉండండి.. ఈ యాప్ వాడేవారికి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక..!
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరించింది. ఎస్‌రైడ్ ( sRide) యాప్ వాడేవారిని అప్రమత్తం చేసింది. ఈ యాప్‌ను మొబైల్‌లో వినియోగిస్తున్నట్లయితే వెంటనే..
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరించింది. ఎస్‌రైడ్ ( sRide) యాప్ వాడేవారిని అప్రమత్తం చేసింది. ఈ యాప్‌ను మొబైల్‌లో వినియోగిస్తున్నట్లయితే వెంటనే డిలీట్ చేయాలని ఆర్బీఐ సూచించింది. ఎస్‌రైడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (sRide Tech Private Limited) అనే కంపెనీ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ (వాలెట్) సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి అనుమతి లేదు. అందుకే వినియోగదారులు ఎవరైనా ఈ యాప్ (Mobile App)ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే తొలగించాలని సూచించింది. ఈ యాప్‌కు సంబంధించి ఎలాంటి సేవలు పొందవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.
ఈ యాప్ వల్ల మోసపోతే ఎవ్వరు కూడా బాధ్యత వహించరని, వాలెట్‌లో డబ్బులు వేసుకోవద్దు. పేమెంట్ సెటిల్‌మెంట్ యాక్ట్ 2007 కింద తమ వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎస్‌రైడ్ కంపెనీ సేవలు అందిస్తోంది.. ఆ యాప్‌వల్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. ఎస్‌రైడ్ అనేది కార్ పూలింగ్ యాప్. ఈ యాప్ ద్వారా కారు బుకింగ్ సేవలు పొందవచ్చు. అయితే యాప్‌లను వాడే ముందు ఆర్బీఐ నుంచి పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లుగా పని చేసే కంపెనీల వివరాలు తెలుసుకోవాలని, మీ మొబైల్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు యాప్‌కు సంబంధించి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిదని సూచించింది ఆర్బీఐ. ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని, లేదంటే యాపిల్ స్టోర్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో కొన్ని మోసపూరిత యాప్స్ వస్తుండటంతో అడ్డంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని యాప్స్ వల్ల మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు తస్కరించే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: