AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone: ఎయిర్‌టెల్‌‌కు తన వాటాను విక్రయించనున్న వోడాఫోన్.. డీల్ విలువ ఎంతంటే..

Vodafone: ఇండస్ టవర్స్‌లో దాదాపు ఐదు శాతం వాటాను విక్రయించేందుకు బ్రిటిష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వొడాఫోన్ భారతీ ఎయిర్‌టెల్‌తో చర్చలు జరుపుతోంది. వొడాఫోన్ ప్రస్తుతం ఇండస్ టవర్స్‌లో 28 శాతం వాటాను కలిగి ఉంది.

Vodafone: ఎయిర్‌టెల్‌‌కు తన వాటాను విక్రయించనున్న వోడాఫోన్.. డీల్ విలువ ఎంతంటే..
Vi Airtel
Ayyappa Mamidi
|

Updated on: Feb 23, 2022 | 8:07 PM

Share

Vodafone: ఇండస్ టవర్స్‌లో(Indus Towers) దాదాపు ఐదు శాతం వాటాను విక్రయించేందుకు బ్రిటిష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వొడాఫోన్ భారతీ ఎయిర్‌టెల్‌తో(Bharati Airel) చర్చలు జరుపుతోంది. వొడాఫోన్ ప్రస్తుతం ఇండస్ టవర్స్‌లో 28 శాతం వాటాను కలిగి ఉంది. రూ. 3,300 కోట్ల విలువైన ఇండస్ టవర్స్ కంపెనీలో తన ఐదు శాతం వాటాను విక్రయించడానికి వోడాఫోన్ ఎయిర్‌టెల్‌తో ఇప్పటికే చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేల్ నుంచి వోడాఫోన్ అందుకున్న మొత్తం దాని భారతీయ విభాగమైన.. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌కి బదిలీ చేయబడుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ టవర్స్ లిమిటెడ్‌ను గతంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఈ డీల్ ద్వారా వొడఫోన్ 4.7 శాతం వాటా అంటే 636 షేర్లను అమ్మాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కంపెనీ వద్దు ప్రస్తుతం 757.8 మిలియన్ షేర్లు ఉండగా.. వాటి విలువ మార్కెట్ విలువ ప్రకారం 2.5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఇది టెలికాం సంస్థలకు అవసరమైన టవర్లను నెలకొల్పుతుంది, కొనుగోలు చేయడంతో పాటు వాటిని నిర్వహిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ టవర్స్‌లో 1, 84,748 టెలికాం టవర్లు ఉన్నాయి. అసలు ఈ నిర్ణయానికి వెనుక అసలు కారణం దిగ్గజ టెలికాం ఐడియాతో విలీనం జరిపిన తరువాత సైతం జియో, భారతీ ఎయిర్ టెల్ నుంచి ఎదురైన తీవ్ర పోటీతో మిలియన్ల మంది టెలికాం వినియోగదారులను కోల్పోవటమేనని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

IRCTC Account: ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లను బుక్‌ చేస్తున్నారా..? ఇలా చేస్తే నెలకు 12 టికెట్స్‌ పొందవచ్చు

Fixed Deposit: టార్గెట్ మెచూరిటీ ఫండ్ అంటే ఏమిటి? ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే మెరుగైన పెట్టుబడి మార్గమా..