PM-Kisan: రైతులకు అలర్ట్.. 11వ విడత డబ్బు కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలి..

దేశంలోని ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్క్రీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) (PM Kisan) పథకం కూడా ఒకటి.

PM-Kisan: రైతులకు అలర్ట్.. 11వ విడత డబ్బు కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ విషయాలను తెలుసుకోవాలి..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2022 | 7:19 PM

దేశంలోని ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్క్రీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) (PM Kisan) పథకం కూడా ఒకటి. దీనిని 2018 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా భూమి కల్గిన రైతులకు ఆర్థిక భరోసా ఇస్తుంది. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి రూ. 6వేలు వారి బ్యాంకు ఖాతాల్లో వేయనుంది. అయితే ఈ నగదు మొత్తం ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా అందించనుంది. ఒక్కో విడతలో రూ. 2000 చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఇప్పటివరకు పది విడతలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. త్వరలోనే 11వ విడత నగదు అందచేయనుంది. అయితే ఈ 11వ విడత నగదు అందుకోవడానికి ముందు రైతులు ఈ విషయాలను తెలుసుకోవాలి.

తమ పేర్లతో సాగు భూమి ఉన్న రైతులు.. వారి కుటుంబాలు ఈ పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులు. అయితే ఈ 11వ విడత డబ్బులు విడుదల చేయడానికి ముందు పీఎం కిసాన్ పథకంలో కొన్ని మార్పులు జరిగాయి. పీఎం కిసాన్ వెబ్ సైట్‏లో కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, డిపార్ట్‏మెంట్స్, వారి ఫీల్డ్ యూనిట్స్, కేంద్ర, రాష్ట్ర పీఎస్ఈలు, అటాచ్ట్ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థలతోపాటు.. స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు, సర్వీసింగ్ లేదా రిటైర్ట్ అధికారులు ఈ పథకానికి అర్హులు కాదు. అలాగే పదవీ విరమణ చేసిన మల్టీ టాస్కింగ్ ఉద్యోగులు.. ప్రస్తుతం సేవలు అందిస్తున్నవారు ఈ పథకానికి అర్హులు. వీరితోపాటు.. క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులు పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. అయితే వారి కుటుంబంలోని సభ్యులు ఇతరత్రా అర్హత కలిగి ఉంటే.. ఇతర మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి రావు..

పీఎం కిసాన్ పోర్టల్‏లోని ఫార్మర్స్ కార్నర్ ద్వారా లబ్దిదారులు తమ స్థితిని తెలుసుకోవచ్చు. * ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‏సైట్ ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత హోమ్ పేజీలో బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. * ఇప్పుడు లబ్ధిదారుని స్థితిపై క్లిక్ చేసిన తర్వాత..అతని ఆధార్ నంబర్, ఖాతా నంబర్, మొబైల్ నంబర్ సెలక్ట్ చేసి ఎంటర్ చేయాలి. * ఆ తర్వాత డేటా పొందండి (గెట్ డేటా) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * ఇప్పుడు లబ్ధిదారులు డేటాను చూసి తెలుసుకోవచ్చు.

మరిన్న వివరాలు తెలుసుకోవడానికి లబ్ధిదారులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‏సైట్‏లోకి లాగిన్ కావాలి.

Also Read: Bheemla Nayak Pre Release Event Live: ఘనంగా ప్రారంభంమైన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్

Ante Sundaraniki: గండాలు దాటడం కోసం హోమగుండాల చుట్టూ తిరుగుతున్న సుందరం.. పుట్టిన రోజున ఇలా..

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే..