Bheemla Nayak Pre Release Event Highlights : ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్
అంతుచిక్కని అభిమానం.. హోరెత్తిన స్టేడియం. ఎక్కడా అనుకునేరు హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్... భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ పంక్షన్.

Bheemla Nayak: అంతుచిక్కని అభిమానం.. హోరెత్తిన స్టేడియం. ఎక్కడా అనుకునేరు హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్… భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ పంక్షన్. తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ పండుగ మొదలైంది. మరికొద్ది క్షణాల్లో భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ పంక్షన్ స్టార్ కానుంది. ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్ గ్రౌండ్స్ వేదిక కాగా.. ఇప్పటికే స్టేడియం పవన్ ఫ్యాన్స్ తో కిక్కిరిసింది. డీజే పాటలతో గ్రౌండ్ హోరెత్తుంది. పవన్ ఫ్యాన్స్ మరికొన్ని క్షణాల్లో వేదికపై పవన్ కల్యాణ్ ను చేసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తు్న్నారు. భీమ్లా ప్రీరిలీజ్ వేదికపై ఏ డ్రైస్ లో మెరుస్తాడా? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రీరిలీజ్ ఫంక్షన్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, యువనేత కేటీఆర్ వస్తుండడంతో ఫంక్షన్ మరింత ఇంట్రస్టింగ్ మారింది. వేడుకలో త్రివిక్రమ్, పవన్, కేటీఆర్, రానాలు ఏం మాట్లుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు పవన్‌కల్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్ ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే థియేటర్లు వారం రోజుల పాటు బుక్ అయ్యాయి. బుక్ మై షోలో హాట్ కేక్ లా భీమ్లానాయక్ టికెట్లు అమ్ముడుపోయాయి. చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో భీమ్లా నాయక్ మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
LIVE NEWS & UPDATES
-
జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్..
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అదేవిధంగా కార్యక్రమంలో ఏవైనా ఇబ్బందులు ఎదురై ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని పవన్ కోరారు. ‘చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. చిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. మా చిత్ర పరిశ్రమకు సహాయ సహకారాలు అందిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చివరిగా ‘జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు పవర్ స్టార్.
-
కేటీఆర్ ను ‘రామ్ భాయ్’ అని పిలుస్తాను..
భీమ్లానాయక్ సినిమా ప్రి రీలీజ్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్ కు నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘నేను కేటీఆర్ ‘రామ్ భాయ్’ అని పిలుస్తుంటాను. పిలిచిన వెంటనే ఈవెంట్ కు వచ్చి మా సినిమాను ప్రోత్సహిస్తున్నందుకు మంత్రికి ధన్యవాదాలు . అలాగే చిత్ర పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ మాకు సహాయమందిస్తున్న మంత్రి తలసాని గారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’ అని పవన్ ప్రసంగించారు.
-
-
పవన్ తొలిప్రేమ సినిమాకు పెద్ద అభిమానిని..
సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు ఎందరున్నా పవన్ లెక్క వేరని, ఆయనది విలక్షణ వ్యక్తిత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన నటించిన తొలిప్రేమ తనకెంతో ఇష్టమన్నారు. ‘నాలుగేళ్ల క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా ఈవెంట్ కు వచ్చాను. ఇప్పుడు పవర్ స్టార్ సినిమా ఫంక్షన్ కు వచ్చాను. నేను ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా పవన్ సోదరుడిగా ఇక్కడకు వచ్చాను. మొగిలయ్య లాంటి కళాకారులకు వెలుగులోకి తెచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ ‘ అని కేటీఆర్ ప్రసంగించారు.
-
చిత్ర బృందాన్న ఘనంగా సత్కరించిన పవన్, కేటీఆర్..
భీమ్లానాయక్ చిత్ర బృందాన్ని నటుడు పవన్ కల్యాణ్, మంత్రి ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ సాగర్ కే. చంద్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఎడిటర్ నవీన్ నూలీ తదితరులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందించారు.
-
పవర్ స్టార్ కంటే ముందే ఈ సినిమాలోకి వచ్చాను..
ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకెత్తు.. కానీ ఈ సినిమా ద్వారా ఎంతోమంది మేధావులను కలుసుకున్నానని నటుడు రానా దగ్గుబాటి తెలిపారు. పవన్ కంటే ముందే ఈ సినిమాలోకి అడుగుపెట్టానని, ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని భళ్లాల దేవ పేర్కొన్నారు.
-
-
గురూజీ లేకపోతే భీమ్లానాయక్ సినిమా లేదు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకపోతే ‘భీమ్లానాయక్’ సినిమా లేదని డైరెక్టర్ సాగర్ కే. చంద్ర తెలిపారు. ఆయన సహకారంతోనే ఈ సినిమా సూపర్ గా వచ్చిందన్నారీ యంగ్ డైరెక్టర్. పవన్ నటించిన పంజా ఆడియో ఫంక్షన్ కు ఎంట్రీ దొరకలేదు. కానీ ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు.
-
24 ఏళ్లయినా పవన్ క్రేజ్ తగ్గట్లేదు..
పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్లు గడిచినా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ తెలిపారు. ఆయన మారుమూల గ్రామాల్లోని కళాకారులను వెలుగులోకి తీసుకువచ్చి ఎంతో మంచి పని చేస్తున్నారన్నారు. భీమ్లానాయక్ సినిమా మంచి హిట్ కావాలని, టీంకు అభినందనలు తెలిపారు మంత్రి.
-
యాంకర్ సుమపై దానం ప్రశంసలు..
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రసంగించారు. భీమ్లానాయక్ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ భాషల్లో యాంకరింగ్ లో అదరగొడుతోన్న యాంకర్ సుమను ప్రత్యేకంగా ప్రశంసించారు ఎమ్మెల్యే దానం.
-
ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరిలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన గురూజీ..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి నుంచి ఈవెంట్ లో ఆయన కనపడకపోవడంతో రాలేదనుకుంటున్న సమయంలో సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు.
-
డ్రమ్స్ వాయించిన పవర్ స్టార్, కేటీఆర్..
ఎస్.థమన్ , శివమణితో కలిసి పవన్ కల్యాణ్, మంత్రి కేటీఆర్ డ్రమ్స్ వాయించి అభిమానులను ఉత్సాహపరిచారు. వీరితో పాటు రానా, మరో మంత్రి తలసాని స్టేజిపైకి చేరుకున్నారు. పవన్, కేటీఆర్ స్పీచ్ ల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో ఆకట్టుకున్న సంయుక్త మీనన్..
తెలుగులోకి పరిచయం అవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు అన్నారు హీరోయిన్ సంయుక్త మీనన్.. భీమ్లానాయక్ లాంటి సినిమాలో నటించడం అదృష్టం అన్నారు సంయుక్త మీనన్. తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటిస్తుంది సంయుక్త. ఖుషి సినిమాలోని సిద్దు సిద్దార్థరాయ్ డైలాగ్ తో అదరగొట్టిన సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్ ఇల్లేమో దూరం డైలాగ్ చెప్పిన సంయుక్త..
-
దుర్గవ్వను స్టేజ్ పైన సన్మానించిన హీరోయిన్ సంయుక్తమీనన్..
ఈ సినిమాలోని అడవి తల్లి పాట పడిన దుర్గవ్వను స్టేజ్ పైన సన్మానించిన హీరోయిన్ సంయుక్తమీనన్.. ఈపాట ద్వారా దుర్గవ్వ కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..
-
భీమ్లానాయక్ కొత్త ట్రైలర్..
భీమ్లానాయక్ కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈ సరికొత్త ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ లో లేని కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్ లో యాడ్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది.
-
పవన్ కళ్యాణ్ గారికి పాట పాడాను అంటే ఊరంతా సెలబ్రేట్ చేసుకుంది: రామ్ మిరియాల
పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాడాను అంటే మా ఊరంతా సెలబ్రేట్ చేసుకుంది అన్నారు సింగర్ రామ్ మిరియాల.. భీమ్లానాయక్ సినిమాలో ఆయన టైటిల్ సాంగ్ పాడారు.
-
టైటిల్ సాంగ్ కోసం రెండు మూడు కీబోర్డ్స్ విరిగిపోయాయి: తమన్
టైటిల్ సాంగ్ చేయడమంటేనే పూనకాలు వస్తాయి. అదీ పవన్ కళ్యాణ్ గారికి అంటే అది నెక్స్ట్ లెవల్ అన్నారు తమన్. రెండు మూడు కీబోర్డ్స్ పగలగొడితే కానీ ఈ సినిమా టైటిల్ సాంగ్ రాలేదు అని అన్నారు తమన్..
-
బ్లాక్ షర్ట్‌లో సింపుల్ లుక్‌లో మెరిసిన పవర్ స్టార్..
బ్లాక్ షర్ట్ లో సింపుల్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ను చూసి అభిమానులు కేకలతో పోలీస్ గ్రౌండ్ హోరెత్తింది.. పవన్ తోపాటు దగ్గుబాటి రానా కూడా ఎంట్రీ ఇచ్చారు..
-
రాయల్ ఎంట్రీ ఇచ్చిన పవన్..
రాయల్ ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ తోపాటు తలసాని, కేటీఆర్ , రానా కూడా ఎంట్రీ ఇచ్చారు.
-
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ఇద్దరూ బాషా ప్రియులు : రామజోగయ్య శాస్త్రి
పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ ఇద్దరూ బాషా ప్రియులు, సంగీత ప్రియులు. అందుకే మొగిలయ్య గారిని వెతికి కనిపెట్టి వెలుగులోకి తీసుకువచ్చారు న్నారు రామజోగయ్య శాస్త్రి. ఇక ఈ సినిమాలో మూడు పాటలు రాసాను.. చాలా అలవోకగా రాసాను అన్నారు. సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా అన్నారు రామజోగయ్య శాస్త్రి.
-
కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు సన్మానం
కిన్నెర కళాకారుడు మొగిలయ్యను సన్మానించిన నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.. ఈ సినిమాలో మొగిలయ్య పాటను ఆలపించిన విషయం తెలిసిందే. ఆయనకు పద్మశ్రీ లభించిన విషయం తెలిసిందే. మొగిలయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాలో పాటపాడినందుకు నాకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. భీమ్లానాయక్ సినిమాలో పాట పాడటం నా అదృష్టం అన్నారు మొగిలయ్య.. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు మొగిలయ్య. స్టేజ్ పైన పాట పాడిన మొగిలయ్య
-
భీమ్లానాయక్ పాటకు డ్యాన్స్ వేసి ఆకట్టుకున్న గణేష్ మాస్టర్
భీమ్లానాయక్ సినిమాలోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన గణేష్ మాస్టర్.. పవన్ కళ్యాణ్ గారితో పనిచేయడం అదృష్టం.. దేవుడికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పిన తక్కువే అన్నారు గణేష్ మాస్టర్. నన్ను పవన్ సార్ చాలా ప్రోత్సహించారు అని చెప్పుకొచ్చారు గణేష్ మాస్టర్..
-
భీమ్లానాయక్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న సుమ కనకాల
భీమ్లానాయక్ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న సుమ కనకాల.. తన చలాకీ మాటలతో మరోసారి ఈ ఈవెంట్ గా గ్రాండ్ గా ప్రారంభించారు సుమ..
-
పవన్ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపిన సింగర్ సింహ..
పవర్ స్టార్ హుషారైన పాటలతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన సింగర్ సింహ.. పవన్ కళ్యాణ్ సాంగ్స్ కు రెట్టింపు ఉత్సాహంతో కేరింతలు కొట్టిన ఫ్యాన్స్..
-
పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలే..
స్క్రీన్ మీద ఆయనొక్కడు కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కి పూనకాలే. కానీ… ఆయనతో పాటు మరో హీరో చరిష్మా కూడా యాడయితే.. ఆ లెక్క వేరే వుంటది. ఇటువంటి మల్టిస్టారర్ ట్రయల్ ఒకసారి వేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు భీమ్లానాయక్‌గా ఇంకో అడుగు ముందుకేశారు పవర్‌స్టార్. తనకు తానే పోటీదారుణ్ణి తెచ్చుకుని.. కొట్టేసుకుందాం రా అంటున్నారు.
-
భీమ్లానాయక్‌లో సరికొత్తగా కనిపించనున్న పవర్ స్టార్..
భీమ్లానాయక్… ఏ సినిమాకు రీమేక్‌గా తీశారు.. స్టోరీని ఏ లాంగ్వేజ్ నుంచి ఎడాప్ట్ చేసుకున్నారు.. ఈ విషయాలన్నీ దాదాపుగా అందరికీ తెలిసినవే. కాకపోతే.. ఒరిజినల్‌లో క్యారెక్టర్లకు, మన తెలుగు వెర్షన్‌లో కనిపించే క్యారెక్టర్లకూ చెప్పుకోదగ్గ వేరియేషన్లు చాలానే వున్నాయి. ఆ కాంట్రడిక్షన్ మీద కూడా స్పెషల్‌గా ఫోకస్ చేశారు భీమ్లా ఫ్యాన్స్.
-
సుస్వాగతం సినిమా పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సింగర్ సింహ..
సుస్వాగతం సినిమా పాటతో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సింగర్ సింహ.. పవన్ పాటలతో అభిమానులు కేరింతలు కొట్టారు..
-
పవర్ స్టార్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిన పోలీస్ గ్రౌండ్స్..
పవర్ స్టార్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిన పోలీస్ గ్రౌండ్స్.. జై పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్న పవన్ అభిమానులు.. స్టేజ్ ను తన డ్రమ్స్ తో షేక్ చేయడానికి సిద్దమైన శివమణి.. పవర్ స్టార్ పాటలతో అదరగొట్టాడు సిద్ధమయ్యారు సింగర్స్..
-
పవన్ సినిమా ఛాన్స్‌ను అదృష్టంగా భావించిన తమన్..
తన సినిమాల్లో కొన్ని సెంటిమెంట్స్‌నైతే కచ్చితంగా పాటిస్తారు పవన్‌కల్యాణ్. లేటెస్ట్‌గా ఆ సెంటిమెంట్స్ జాబితాలో తమన్ కూడా చేరిపోయారు. ఎన్నాళ్లో వేచి చూశాక దొరికిన అవకాశాన్ని అదృష్టంగా భావించిన తమన్… పవన్ సినిమాలకు లక్కీ మస్కట్ అనిపించుకుంటున్నారు. భీమ్లానాయక్‌తో ఈ జోడీ మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్ కాబోతోంది.
-
పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన లేడీ ఫ్యాన్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన లేడీ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటున్న ఫ్యాన్స్.. అలాగే భీమ్లానాయక్ సినిమా భారీ హిట్ అవుతుందంటున్న లేడీ ఫ్యాన్స్..
-
భీమ్లానాయక్ సినిమా మాములుగా ఉండదు : సింగర్ సింహ
భీమ్లానాయక్ సినిమా మాములుగా ఉండదంటున్నారు సింగర్ సింహ.. తమన్ సంగీతం ఇరగదీశారన్న సింగర్ సింహ.
-
మాస్ మేనియాకు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్ పవర్ స్టార్..
పవర్ స్టార్… తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద మాస్ మేనియాకు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్. కథా కథనాలతో స్టార్ కాంబినేషన్స్‌తో సంబంధం లేకుండా పవన్ సినిమా అంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డ్‌లు షేక్ అయిపోతుంటాయి.
-
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రీమేక్ సినిమాలు కీ రోల్ ప్లే చేశాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రీమేక్ సినిమాలు కీ రోల్ ప్లే చేశాయి. పవన్ ఫెయిల్యూర్స్‌లో ఉన్న ప్రతీసారి… రీమేక్‌లో సక్సెస్ ట్రాక్‌లో నిలబెట్టాయి. అందుకే భీమ్లా నాయక్ విషయంలోనూ ప్రీ రిలీజ్ బజ్ హై రేంజ్‌లో ఉంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే రీమేక్ సినిమాలతో సక్సెస్ కొడుతూ పవర్ స్టార్‌గా ఎదిగారు పవన్ కల్యాణ్.
-
పవన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు..
పవన్ ఫ్యాన్స్ మరికొన్ని క్షణాల్లో వేదికపై పవన్ కల్యాణ్ ను చేసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భీమ్లా ప్రీరిలీజ్ వేదికపై ఏ డ్రైస్ లో మెరుస్తాడా? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
-
పవన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో ఉండే క్రేజే వేరు
పవన్ , త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో ఉండే క్రేజే వేరు. సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఈ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. తాజాగా భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కాకపోయినా… మేజర్ ఇన్వాల్మెంట్‌తో కథ నడిపిస్తున్నారు మాటల మాంత్రికుడు.
-
జై పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు..
వందలాదిగా తరలి వస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్.. జై పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తున్న అభిమానులు.. మరికాసేపట్లో ప్రారంభంకానున్న భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్
-
ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం భీమ్లానాయక్..
ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం భీమ్లానాయక్. అతడి భార్య క్యారెక్టరయితే అంతకంటే ఎక్కువ. భీమ్లాను మోటివేట్ చేసే పాత్ర. అటువంటి రోల్ కాబట్టే ఒప్పుకున్నారట నిత్యామీనన్. నిజానికి నిత్య కెరీర్‌లోకి చూస్తే.. గతంలో ఆమె చేసిన పాత్రలన్నీ ఇటువంటి మాంచి పవరున్నవే.
-
పవర్ స్టార్ పాటలతో షేక్ అవుతున్న వేదిక..
పవర్ స్టార్ పాటలతో షేక్ అవుతుంది ఈవెంట్.. పవర్ స్టార్ ఎంట్రీ కోసం పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలీస్ గ్రౌండ్స్ బయట భారీగా చేరుకున్నఅభిమానులు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేస్తున్న పోలీసులు..
-
పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తుతున్న స్టేడియం..
పవర్ స్టార్ పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తుతున్న స్టేడియం.. ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీగా చేరుకున్న పవర్ స్టార్ అభిమానులు.
-
పవర్ స్టార్ స్టిల్స్‌తో కేక పుట్టిస్తున్న స్టేజ్..
భారీగా తరలి వస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు సితార ఎంటర్టైన్మెంట్స్ వారు. పవర్ స్టార్ కటౌట్స్, న్యూ స్టిల్స్ తో అదిరిపోయిన ఈవెంట్ స్టేజ్..
-
గబ్బర్ సింగ్ గెటప్‌లో అదరగొట్టిన పవన్ ఫ్యాన్..
పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఆకట్టుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్.. పవర్ స్టార్ గబ్బర్ సింగ్ గెటప్‌లో అదరగొట్టిన పవన్ ఫ్యాన్.. నిజంగా పవన్ కళ్యాణ్ అనుకునేలా పోలీస్ డ్రస్ లో వచ్చిన పవన్ ఫ్యాన్..
-
ప్రీరిలీజ్ ఈవెంట్ తరలి వస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్..
ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ కు తరలి వస్తున్న పవర్ స్టార్ అభిమానులు..
Published On - Feb 23,2022 5:31 PM