Weight Loss Tips: డైటింగ్ లేకుండానే ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు తెలుసా..? అయితే ఈ ఐదు చిట్కాలను పాటించండి..
Weight Loss without Diet Plan : దైనందిన జీవితంలో మన జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతోపాటు కరోనా లాక్‌డౌన్ కూడా బరువు
Weight Loss without Diet Plan : దైనందిన జీవితంలో మన జీవనశైలి కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతోపాటు కరోనా లాక్‌డౌన్ కూడా బరువు పెరిగేలా చేసింది. అయితే బరువు తగ్గడానికి ఊబకాయులు నిత్యం అనేక రకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తే.. మరికొంత మంది జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చుతుంటారు. అయితే ఎలాంటి కఠినమైన డైట్ ప్లాన్ లేకుండా కూడా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బిజీ లైఫ్ కారణంగా చాలామంది డైట్ ప్లాన్ పాటించకుండా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఊబకాయంతో బాధపడుతున్నవారు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే.. బరువును తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ పద్దతుల్లో ఎలాంటి ఆహార ప్రణాళికను అనుసరించాల్సిన అవసరం లేదు. సన్నగా నాజూగ్గా మారాడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే చాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసకుందాం..
బరువు తగ్గేందుకు చిట్కాలు.. ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి.. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. దీనివల్ల జీవక్రియ సులభంగా జరిగి.. బరువు తగ్గేలా సహాయపడుతుంది. భోజనంలో మాంసాహారం కొద్దిగా తీసుకుంటే మేలని సూచిస్తున్నారు. ఆహారంలో చికెన్ బ్రెస్ట్, లైట్ ట్యూనా, సాల్మన్, గుడ్డు, సోయా పాలు, బీన్స్, మొలకలు, పప్పు మొదలైనవి తీసుకుంటే మంచిది.
ఆహార కోరికలను నియంత్రించుకోవాలి.. మనం బోర్ కొట్టినప్పుడల్లా.. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను (చిరుతిండి) తింటూ డ్రింక్స్ తాగుతుంటారు. అలాంటి వాటిని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ కేలరీలు ఉన్న పానీయాలను తీసుకోవాలి. గ్రీన్ టీ, హెర్బల్ టీ లాంటివి తాగాలి. దీనివల్ల శరీరంలో జీవక్రియ పెరిగి కొవ్వు కరుగుతుంది. అయితే.. సాధ్యమైనంతమేర పాలు, చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
ఆహారాన్ని బాగా నమలాలి.. ఆహారాన్ని సరిగ్గా నమలి తినాలి. ఎందుకంటే.. ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియ లాలాజలంలో ఉండే ఎంజైమ్‌లతో మొదలవుతుంది. ఇలా చేయడం ద్వారా ఆహారం బాగా జీర్ణమవుతుంది. దీంతో కడుపు పూర్తిగా నిండినట్లు మెదడుకు సంకేతాలు అందుతాయి. దీనివల్ల బరువు కూడా తగ్గవచ్చు.
ఫైబర్ ఆహార పదార్థాలు తీసుకోవాలి.. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదర్థాలను తీసుకోవాలి. ఇవి పొట్టను చాలాసేపటి వరకు నిండుగా ఉంచుతాయి. దీంతోపాటు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. ఇలా చేయడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు.
ఆహారంలో సుగంధ ద్రవ్యాలు జోడించాలి.. సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడమే కాకుండా బరువును సైతం తగ్గిస్తాయి. మసాలా ఆహారాన్ని తినేటప్పుడు.. నెమ్మదిగా తింటు ఎక్కువ నీరు తాగాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పైసీ ఫుడ్ వల్ల మెటబాలిజం పెరిగి ఆడ్రినలిన్ హార్మోన్ విడుదల అవుతుందని.. దీనివల్ల బరువు తగ్గవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: