Rainy Season Tips: వర్షం కురుస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే..

జోరుగా వర్షం కురుస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్‌తో బారెడు పొద్దెక్కుతున్నా సూర్యుడు కనిపించడంలేదు. తెలుగు రాష్ట్రాలు ముసురుపట్టి ముసుగేశాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో..

Rainy Season Tips: వర్షం కురుస్తున్నప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే..
Rain
Follow us

|

Updated on: Sep 27, 2021 | 3:25 PM

జోరుగా వర్షం కురుస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్‌తో బారెడు పొద్దెక్కుతున్నా సూర్యుడు కనిపించడంలేదు. తెలుగు రాష్ట్రాలు ముసురుపట్టి ముసుగేశాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో  ఊరు, వాడా అని తేడా లేకుండా వరద కాలువలను తలపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వాతావరణంలో వచ్చే మార్పులు మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంటాయి.

చర్మం, వెంట్రుకల సంరక్షణ..

వర్షానికి తడిస్తే మొట్టమొదటి ప్రభావం పడేది చర్మంతోపాటు వెంట్రుకల మీదే. ఈ రెంటి గురించీ చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటిలో ముఖ్యంగా వెంట్రుకలు గురించి శ్రద్ద తీసుకోవాలి. వర్షాకాలంలో తడిసి ఇంటికి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి. తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. తలో చుండ్రు రావడం.. ఆ తర్వాత మొహంపై మొటిమలు రావడం జరుగుతుంది. ఇతర ఇన్ఫెక్షన్లు బాధించే ఛాన్స్ ఉంది. అందుకే తలతడవకుండా గొడుగు లాంటివి ఉపయోగించాలి. వర్షాకాలంలో డే టు డే కేర్ తీసుకొంటే జుట్టును కాపాడుకోవచ్చు.

కలుషిత ఆహారంతో..

కలుషిత ఆహారంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఉండే అధిక తేమ మన జీర్ణశక్తిని తగ్గిస్తుంది.  బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవులు, విషపదార్థాల వల్ల ఆహారం, నీరు కలుషితమవటంతో వివిధ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంది. ఈ అనారోగ్యంను వర్షాకాలంలో తప్పించుకోవటం అనివార్యం. వైరస్ వ్యాప్తికి దోహదపడే కలుషిత ఆహారం, చల్లని  పదార్థాలను తీసుకోవద్దు.

ఇంటి పరిసరాలు..

వర్షాకాలంలో శారీరకంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు. ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు తేమ ఉంటాయి. వాటితో ఇల్లంతా ఓ రకమైన వాసనలు వస్తుంటాయి.

దోమలు.. ఈగలు..

వానాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండాలీ అంటే దోమలు, ఈగలను దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. కొన్ని రకాల జ్వరాలు, అంటువ్యాధుల వ్యాప్తికి అవే కారణం అవుతుంటాయి. మనం నివసించే పరిసరాల్లో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లోగానీ ఇంటి పరిసరాల్లోగానీ దోమలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షంలో తడిసినట్లయితే..

వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.  ఆ తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో ఎక్కువగా తడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే కాళ్ళను గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.

ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..

Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్‌ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..

Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..