AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgin Boy Egg: ఆ దేశంలో విచిత్ర వంటకం.. ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లు.. ఆరోగ్యానికి మేలంటున్న డ్రాగన్ వాసులు

Virgin Boy Egg: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆ దేశాల్లో ఎన్నో ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలు.. కట్టుకునే బట్టలనుంచి, తినే ఆహారం పూజించే దేవుడు ఎన్నో విభిన్న సంప్రదాయాలున్నాయి. అయితే కొన్ని కొన్ని..

Virgin Boy Egg: ఆ దేశంలో విచిత్ర వంటకం.. 'మూత్రం'తో ఉడికించిన గుడ్లు.. ఆరోగ్యానికి మేలంటున్న డ్రాగన్ వాసులు
Virgin Boy Eggs
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 27, 2021 | 11:54 AM

Share

Virgin Boy Egg: ప్రపంచంలో అనేక దేశాలు.. ఆ దేశాల్లో ఎన్నో ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలు.. కట్టుకునే బట్టలనుంచి, తినే ఆహారం పూజించే దేవుడు ఎన్నో విభిన్న సంప్రదాయాలున్నాయి. అయితే కొన్ని కొన్ని  దేశాల్లోని సంప్రదాయాలు తెలిస్తే.. కొన్ని సార్లు విచిత్రంగా ఉన్నాయని పిస్తే.. మరికొన్ని వింత ఆచారాల గురించి వింటే బాబోయ్ ఇలాంటి ఆచారాలు, అలవాట్లు కూడా ఉన్నాయా అంటూ షాక్ తినడమే కాదు.. అలాంటివి మనకు వద్దు అని కూడా అనిపిస్తాయి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో గబ్బిలాలతో సహా ఆహారంగా తీసుకుంటారని తెలుసు..ఇక మన పొరుగు దేశం డ్రాగన్ కంట్రీ లో తినే వంటల గురించి మనకు తెలిసిందే.. పాకేవి, ఈదేవి, ఎగిరేవి, తేలేవి అది, ఇది అని తేడాలేకుండా అన్నింటికీ ఓ పట్టుబడతారు. అయితే చైనాలో మరో వింత వంటకం టాయిలెట్ తో ఉడకబెట్టిన గుడ్లు.. ఇవి చైనాలో ఓ ప్రాంతాల్లో ప్రత్యేక సాంప్రదాయ వంటకం.. ఆ స్పెషల్ ఫుడ్ గురించి వివరాల్లోకి వెళ్తే..

మనం బాత్రూమ్ పరిసరప్రాంతాల్లో కనీసం తినటానికి కూడా ఇష్టపడం.. అయితే చైనాలోని  చైనాలోని జెజియాంగ్‌లో ఏకంగా టాయిలెట్ తోనే వంటను చేస్తారు. ఇక్కడ చేసే ఈ వంట చాలా ఫేమస్ కూడా అట.  డాంగ్‌యాంగ్లో అనే ప్రాంతాల్లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. ఇలా గుడ్లను ఉండికించడానికి మూత్రం కూడా సేకరించడానికి ఒక ప్రాసెస్ కూడా ఉందట. 10 ఏళ్ల లోపు వయసున్న మగపిల్లల నుంచి మూత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సేకరిస్తారట. అలా సేకరించిన మూత్రంలో గుడ్లను నానబెట్టి ఉడికించి ప్రత్యేక ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. వీటిని ‘Virgin boy egg’ డిష్ అని పిలుస్తారు. సంప్రదాయ వంటగా దీనిని చాలా ఇష్టంగా తింటారట. ఇలా మూత్రం సేకరించడానికి ఫుడ్ స్టాల్స్ వారు పాఠశాల్లో బకెట్లను పెడతారు. ఆ బకెట్లలో 10 లోపు వయసున్న బాలురు టాయిలెట్ పోస్తారు. ఇలా సేకరించిన మూత్రంలో గుడ్లను సుమారు 7గంటల పాటు నానబెడతారు. అనంతరం వాటిని ఉడకబెట్టి.. పైన పెంకు వలిచి అప్పుడు గుడ్లతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేస్తారు. ఈ ఫుడ్ ని తినడం అక్కడవారు సంస్కృతిలో భాగంగా మారిపోయింది.

ఆరోగ్య ప్రయోజనాలు: 

మూత్రంతో ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చైనీయుల నమ్మకం. మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినటం వల్ల బాడీ వేడిని తగ్గించటంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుందని చెబుతున్నారు. ప్రాచీన కాలంలో గుడ్లు ఒకరి సొంత మూత్రంలో ఏడు రోజులుపాటు ఉంచి..వాటిని మూడు నెలలపాటు తింటే దీర్ఘకాలిక ఆస్తమాను నివారించవచ్చని చైనీయులు నమ్ముతారు. చిన్నపిల్లవాడి మూత్రం చాలా శక్తివంతమైనదిగా చైనీయులు భావిస్తారు. ఈ మూత్రాన్ని మూలికలతో కలపి టానిక్ కూడా తయారు చేస్తారు. ఇక యూరిన్ థెరపీ అనేది చైనీయులు సాంప్రదాయ వైద్యంలో భాగం. ప్రాచీనకాలంలో మూత్రాన్ని మెడిసన్ గా ఉపయోగించేవారు. మూత్రం పోసినప్పుడు కొద్ది సేపటికి ఆరిపోతుంది. అనంతరం ఇది స్పటికీకరిస్తుంది. మూత్రాన్ని వాపు, చర్మం, నోటి ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.

Also Read :  తవ్వకాల్లో బయల్పడిన కోట్ల విలువజేసే విగ్రహాలు.. చోళరాజుల కాలం నాటివని గుర్తింపు