Hindu Heritage Month: అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అక్టోబర్‌ను హిందూ మాసంగా గుర్తింపు.. వేడుకలకు రెడీ అవుతున్న హిందువులు

Hindu Heritage Month:భారత భూమి కర్మ భూమి. ఆధ్యాత్మికతకు నిలయం. సనాతన ధర్మానికి, హిందూ సంస్కృతి-సంప్రదాయాలకు నెలవైన వేద భూమి.  సనాతన ధర్మంలో ఆచారం సంప్రదయం నేడు..

Hindu Heritage Month: అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అక్టోబర్‌ను హిందూ మాసంగా గుర్తింపు.. వేడుకలకు రెడీ అవుతున్న హిందువులు
Hindu Heritage Month
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 12:57 PM

Hindu Heritage Month:భారత భూమి కర్మ భూమి. ఆధ్యాత్మికతకు నిలయం. సనాతన ధర్మానికి, హిందూ సంస్కృతి-సంప్రదాయాలకు నెలవైన వేద భూమి.  సనాతన ధర్మంలో ఆచారం సంప్రదయం నేడు ప్రపంచదేశాలు పాటించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు ఆసియా దేశాలు కూడా దైవత్వం నింపుకున్న సంగీతం, కళలు వైపు చూస్తున్నాయి. ఇక మన ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మంచివని పాటించడం మొదలు పెట్టాయి కూడా.  అవును భారత దేశం ఎందరో మహానుభావులు, వేదాలు, ఋషులు, పుణ్యపురుషులు కలగలిసి ఆధ్యాతికతతో విరాజిల్లుతోంది. ఇక భారతీయులు ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో నివసిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న అక్కడ తమ సంప్రదాయాన్ని అనుసరిస్తూ పండగలు, పూజలు ఫంక్షన్లను జరుపుకుంటూ.. హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను తమ పిల్లలకు.. భవిష్యత్తు తరాలకు అందించేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

ఇక విదేశాల్లో ఉన్న భారతీయులే కాదు.. అక్కడ ఉన్న విదేశీయులను సైతం మన సనాతన ధర్మం ఆకర్షిస్తుంది. మనదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను ఎంతో ఇష్టంగా పవిత్రంగా మన ధర్మాన్ని ఆచరిస్తూ విదేశీయులు దర్శించుకోవడం తరచుగా చూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం ప్రతి హిందువు గారవించేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఒహాయో సహా పలు రాష్ట్రాలకు చెందిన గవర్నర్ కార్యాలయాలు ఈ మేరకు కీలక ప్రకటన చేసాయి. అమెరికా లో హిందూ మతం, చరిత్ర అమెరికా అభ్యున్నతికి ఎంతో దోహదం చేశాయని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఆయా రాష్ట్రాలకు విశ్వ హిందూ పరిషత్ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు మొత్తం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా అక్టోబర్ నేలను హిందూ మాసంగా గుర్తించాలని పెద్దన్నకు విజ్ఞప్తి చేశారు.  ఈ సందర్భంగా అమెరికాలో లక్షలాది మంది హిందువులు ఉన్నారని..  ప్రతీ ఒక్కరూ హిందుత్వాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేసేలా ప్రయత్నించాలని విశ్వహిందూ పరిషత్ కోరుతుంది. అంతేకాదు ఒక్క అమెరికాలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం హిందుత్వ గొప్పదనాన్ని గుర్తించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. అక్టోబర్‌లో జరిగే ఈ నెల వేడుకల కోసం హిందువులు రెడీ అవుతున్నారు. తమ కళలు, నృత్యం, సంగీతం, యోగా, ధ్యానం, బుద్ధి, ఆయుర్వేదం వంటి వాటిల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు.

Also Read:  దేశ ప్రజల ఆరోగ్యభద్రతే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..