- Telugu News Photo Gallery Spiritual photos History of Antarvedi Lakshmi Narasimha Swamy Temple in east godavari andhra pradesh
Antarvedi Temple: నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి.. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులతో పూజలందుకుంటున్న క్షేత్రం
Antarvedi Temple: పచ్చని ప్రకృతి నడుమ వెలసిన పురాతన క్షేత్రం అంతర్వేది. ఇక్కడ శ్రీలక్ష్మి నరసింహ స్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. శివుడు పట్ల బ్రహ్మ చేసిన అపచారానికి ప్రాయశ్చితంగా యాగం చేసిన ప్రాంతం అంతర్వేదని పురాణాల కథనం. సముద్రంలో గోదావరి కలిసే ప్రాంతం.. అన్నా చెల్లెల గుట్టుగా ప్రసిద్ధి.
Updated on: Sep 27, 2021 | 2:12 PM

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం అంతర్వేదిని త్రేతాయుగంలో శ్రీరాముడు దర్శించాడు. రావణబ్రహ్మ ను సంహరించిన రాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి ని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడని పురాణాల కథనం. ఇక ద్వాపర యుగంలో అర్జనుడు తీర్ధ యాత్రలను చేస్తూ.. అంతర్వేదిని దర్శించుకున్నాడట. వసిష్ట మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు ధర్మపత్ని సమేతంగా వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామి వారి పశ్చిమ ముఖంగా వెలసి ఉన్నారు.

కృతయుగంలో వశిష్ట మహర్షికి, విశ్వామిత్రుడికి పోరు జరిగింది. ఆ సమయంలో విశ్వామిత్రుడు తన మంత్ర బలంతో హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తవిలోచనుడిని రప్పించి వశిష్ట మహర్షి వంద మంది కుమారులను వధించాడట. పుత్ర శోకంతో వశిష్ఠమహర్షి నరసింహ స్వామికోసం తపస్సు చేశాడట. స్వామి ప్రత్యక్షమై.. రాక్షసుడైన రక్తవిలోచనుడిని సంహరించాడట.

అయితే రక్తవిలోచనుడికి ఒక వరం ఉంది. అతని శరీరం నుంచి భూమిమీద చిందే రక్తబొట్టు మళ్ళీ రాక్షసులుగా పుట్టే వరం పొందాడు, దీంతో రక్తవిలోచనుడిని సంహరించడానికి ఒక మాయాశక్తిని సృష్టించి తన నాలుకను చాచి.. రక్తపు బొట్టు కింద పడకుండా..చేసి..నరసింహుడు రాక్షసుడిని సంహారం చేశాడని స్థల పురాణం.

.ఆ మాయాశక్తి నేటికి అశ్వరుడంబిక.. గుర్రలక్కమ్మగా.. నేటికీ భక్తులతో పూజలను అందుకుంటుంది. ఇక కృతయుగం ప్రారంభం సమయంలో బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి \నీలకంఠేశ్వరుడిని ప్రతిష్టించి యాగం చేశాడని స్థల పురాణం. అందుకే ఈ క్షేత్రంలో నీలకంఠుడు క్షేత్రాపాలకుడిగా కొలువై ఉన్నాడు .

మాఘమాసం శుద్ధ దశమినాడు స్వామి వారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. భీష్మ ఏకాదశికి కార్తీక పున్నమి రోజున స్వామివారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారి రధోత్సవం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచింది.





























