Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Temples in Pakistan: పాకిస్థాన్‌లో త్రేతాయుగం, ద్వాపర యుగం నాటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు..

Hindu Temples in Pakistan: సనాతన ధర్మంలో భారత దేశం వేదం భూమి. అఖండ భారత దేశంలో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , భారతదేశం, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు ఉండేవి. అంటే బ్రిటిష్ కు ముందున్న ఇది భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే విడిపోయిన పాకిస్తాన్ ముస్లిం దేశంగా గుర్తించబడింది. కానీ అక్కడ కూడా అనేక ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు పాక్ లో ప్రసిద్ధ హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Sep 26, 2021 | 2:49 PM

పాకిస్తాన్ లోని ముఖ్యపట్టణం కరాచీలో ఉన్న పంచముఖి హనుమాన్ ఆలయం అత్యంత పురాతన దేవాలయం. ఇక్కడ కొలువైన హనుమాన్ విగ్రహం త్రేతాయుగం నుండి అంటే దాదాపు 17 లక్షల సంవత్సరాలుగా పంచముఖి హనుమంతుడిగా పూజలను అందుకుంటుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఆలయాన్ని 1882 సంవత్సరంలో పునర్మించారు.

1 / 5
 పాకిస్తాన్ లోని ఇస్లాంకోట్ లో రాముడి ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఇస్లాంకోట్‌లో హిందువులు ఎంతో పవిత్రంగా ఇక్కడ రాముడిని పూజిస్తారు.

2 / 5
 త్రేతాయుగంలో శ్రీరాముడి సైన్యంలో ఉన్న జాంబవంతుడి..  కుమార్తె జమ్వంతిని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడితో వివాహం చేసుకున్నాడు. జమ్వంతి  కృష్ణ దంపతులకు పుట్టిన కుమారుడు సాంబుడు. తండ్రి ఇచ్చిన శాపం నుంచి విముక్తి కోసం సాంబ ముల్తానాలో సూర్యదేవాలయం నిర్మించాడు. ఈ ఆలయం ముస్లింపాలనలో ధ్వంసమై.. ఇప్పుడు శిధిలాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. .

3 / 5
సతి పార్వతి 51 శక్తిపీఠాల్లో ఒకటి హింగ్లాజ్ ఆలయం. ఈ ఆలయం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌కు 120 కి.మీ దూరంలో హింగోల్ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం గురించి దుర్గా చాలీసాలో కూడా ప్రస్తావించబడింది. సతి భాగాలు ఎక్కడ పడితే అక్కడ శక్తిపీఠంగా ఏర్పడిందని పురాణాల కథనం. ఈ క్షేత్రంలో సతిదేవి తలపడిందని చెబుతారు. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి భారతదేశంతో సహా అనేక దేశాల నుండి భక్తులు వెళ్తారు.

4 / 5
 కరాచీ నగరంలోనే బందర్ రోడ్డులో ఉన్న స్వామినారాయణ దేవాలయం సుమారు 160 సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందూ, ముస్లిం లు కూడా పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు భారతదేశం-పాకిస్తాన్ విభజన సమయంలో.. ఈ దేవాలయాన్ని శరణార్థి శిబిరంగా ఉపయోగించారని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక గురుద్వారా కూడా ఉంది.

5 / 5
Follow us