Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AB PM-JAY: దేశ ప్రజల ఆరోగ్యభద్రతే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..

Ayushman Bharat Digital Mission: దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఈరోజు సరికొత్త  పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రధాని..

AB PM-JAY: దేశ ప్రజల ఆరోగ్యభద్రతే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..
Ayushman Bharat Digital Mis
Follow us
Surya Kala

|

Updated on: Sep 27, 2021 | 1:18 PM

Ayushman Bharat Digital Mission: దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఈరోజు సరికొత్త  పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రధాని కార్యాలయంలో జరిగే వర్చువల్‌ ఈవెంట్‌లో ప్రధాని మోడీ ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు తన సందేశాన్ని వినిపించాహ్రూ. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు వీలుగా ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం.. ఈ కార్యక్రమం పైలట్ దశలో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో దేశంలోని ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని ఆ కార్డులో నిక్లిప్తం చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రస్తుతం 6 కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ , డామన్- డయు, లడఖ్, లక్షద్వీప్ – పుదుచ్చేరిలలో టెస్ట్ రన్ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్‌ కార్డ్‌లతో పాటు హెల్త్‌ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ను ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ వెబ్‌ సైట్‌లో అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎఎవరైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లినా, లేదంటే ట్రీట్మెంట్‌ రికార్డ్‌లను పోగొట్టుకున్నా.. చికిత్స అందించాల్సి వస్తే.. మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా వెంటనే ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్ గా ఆ రోగి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. ఒకవేళ  కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సంబంధిత సమాచారం ఈ వెబ్‌ సైట్‌లో భద్రంగా ఉంటుంది. కనుక ఆస్పత్రికి వెళ్లి హెల్త్‌ ఐడి చెబితే సరిపోతుంది.

ఈ పథకాన్ని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో పౌరులతో పాటు డాక్టర్లకు సైతం కేటగిరిని ఏర్పాటు చేసింది. పౌరుల ఆరోగ్య భద్ర రిత్యా ఈ కేటగిరిలో డాక్టర్ల ఇన్ఫర్మేషన్‌తో పాటు, ఆస్పత్రులు, క్లీనిక్‌ల డేటా ఉంటుంది.

Also Read: ఆ దేశంలో విచిత్ర వంటకం.. ‘మూత్రం’తో ఉడికించిన గుడ్లతో ఫుడ్.. ఆరోగ్యానికి మేలంటున్న డ్రాగన్ వాసులు..