Weight Loss Tips: కాఫీతో సునాయాసంగా బరువు తగ్గొచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..!
Weight Loss Tips: ప్రతీ ఒక్కరూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మొదట చేసే పని టీ తాగటం. చాలామంది టీ తాగిన తరువాతే మిగతా పనులు చేస్తుంటారు.

Weight Loss Tips: ప్రతీ ఒక్కరూ ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మొదట చేసే పని టీ తాగటం. చాలామంది టీ తాగిన తరువాతే మిగతా పనులు చేస్తుంటారు. ఇంకొందరైతే బెడ్ టీ, బెడ్ కాఫీ పేరుతో బ్రష్ చేయకుండా కాఫీ, టీ తాగేస్తుంటారు. అధిక బరువుతో బాధపడేవారు తమ బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే, రోజూ ఉదయం తాగే కాఫీతో అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. వ్యక్తి బరువు తగ్గడంలో కాఫీ చాలా సహకరిస్తుందట. అయితే, బరువు తగ్గించేందుకు పలు రకాల కాఫీలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆవేం కాఫీలో ఇప్పుడు చూద్దాం..
1. జాజికాయ కాఫీ.. జాజికాయ కాఫీ రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది ఒక తేలికపాటి మసాలా. జాజికాయలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. మంచి డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ జాజికాయను కాఫీతో కలిపి తీసుకుంటే.. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
2. డార్క్ లెమన్ కాఫీ.. ఈ కాఫీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ కాఫీని నిమిషాల్లో ఎస్ప్రెస్సో షాట్, నిమ్మకాయతో తయారు చేయవచ్చు. దీని వలన కూడా అధిక బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వేడి కప్పు ఎస్ప్రెస్సోలో నిమ్మరసం కలిపి ఈ కాఫీని తయారు చేస్తారు. నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. కడుపులోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. కెఫీన్ ఎనర్జీ లెవల్స్‌ని పెంచుతుంది. వర్కౌట్‌కి ముందు అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది.
3. వెన్న, కొబ్బరి నూనె కాఫీ.. మీరు కీటో డైట్‌లో ఉన్నట్లయితే బుల్లెట్ కాఫీ అని పిలువబడే ఈ ఫ్యాడ్ కాఫీ ట్రెండ్ గురించి మీరు వినే ఉంటారు. దీన్ని మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉప్పు లేని వెన్న లేదా పచ్చి కొబ్బరి నూనె వంటివి కాఫీలో కలిపి తయారు చేస్తారు. ఇది కాఫీని అధిక కేలరీలుగా చేస్తుంది. కడుపు నిండినట్లుగా అనిపిండం వల్ల.. వేగంగా బరువు తగ్గడంలో మరింత సహాయపడుతుంది.
4. డార్క్ చాక్లెట్ కాఫీ.. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెఫిన్, డార్క్ చాక్లెట్ కలిపి చేసిన కాఫీని తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, ఇందులో చెక్కర వేయకూడదు.
5. దాల్చిన చెక్క కాఫీ.. ఒక కప్పు వేడి కాఫీకి చిటికెడు దాల్చిన చెక్కను పొడిని కలపాలి. ఈ మసాలా కాఫీ రుచి, గొప్పతనం అద్భుతంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది, ఇది క్రమంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!