14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

పొట్టి ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వ సాధారణం. సీనియర్ ఆటగాళ్ల నుంచి యువ ప్లేయర్స్...

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు..  సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!
Gurbaz
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 02, 2021 | 9:50 PM

పొట్టి ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు సర్వ సాధారణం. సీనియర్ ఆటగాళ్ల నుంచి యువ ప్లేయర్స్ వరకు అందరూ బౌలర్లపై విరుచుకుపడతారు. ఈ కోవకు చెందిన ఓ బ్లాస్టర్ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 20 ఏళ్ల బ్యాట్స్‌మెన్.. కేవలం 20 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. బ్యాట్‌తో తుఫాన్ సృష్టించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు ఆఫ్గనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్. అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో ఈ విధ్వంసం సృష్టించాడు.

ఇటీవల చెన్నై బ్రేవ్స్, ఢిల్లీ బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ ఢిల్లీ బుల్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్రేవ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని గుర్బాజ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా కేవలం 20 నిమిషాల్లో ఢిల్లీ బుల్స్ జట్టు చేధించింది. 20 ఏళ్ల గుర్బాజ్ ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు.

20 ఏళ్ల గుర్బాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్స్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను ఢిల్లీ బుల్స్‌ 35 బంతుల్లో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. అంటే 81 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4.1 ఓవర్లలోనే ముగించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 356.25 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. గుర్బాజ్ కేవలం 14 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

4 బౌలర్లను ఉతికరేసిన గుర్బాజ్, చందర్‌పాల్..

చెన్నై బ్రేవ్స్ విధించిన టార్గెట్‌ను చేధించే క్రమంలో ఢిల్లీ బుల్స్ వేగంగా తన ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒక ఎండ్ నుంచి గుర్బాజ్(57).. మరో ఎండ్ నుంచి చందర్‌పాల్ హేమ్‌రాజ్(24) బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చందర్‌పాల్ 266.66 స్ట్రైక్‌రేట్‌తో 9 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇందులో 1 సిక్స్‌, 3 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!

ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..