Hardik Pandya : ముంబయి ఇండియన్స్‌ ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటుంది.. హార్దిక్‌ ఎమోషనల్‌ వీడియో..

ఆరేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీతో జతకట్టిన హార్దిక్‌ పాండ్యా తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. గొప్ప ఆటతీరుతో టీమిండియాలో కూడా చోటు సంపాదించాడు..

Hardik Pandya : ముంబయి ఇండియన్స్‌ ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటుంది.. హార్దిక్‌ ఎమోషనల్‌ వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2021 | 7:40 AM

ఆరేళ్ల క్రితం ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీతో జతకట్టిన హార్దిక్‌ పాండ్యా తన ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. గొప్ప ఆటతీరుతో టీమిండియాలో కూడా చోటు సంపాదించాడు. అయితే ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా గత కొన్ని నెలలుగా అతని ఆటతీరులో నిలకడ లోపించింది. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న పాండ్యా.. ప్రస్తుతం ఆ పేరుకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్‌ రీటెన్షన్‌-2022 ప్రక్రియలోనూ ముంబయి ఇండియన్స్‌ అతడిని వదిలేసింది. రోహిత్‌ శర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌పోలార్డ్‌లను మాత్రమే రిటైన్‌ చేసుకుంది. దీంతో పాండ్యా మళ్లీ ఐపీఎల్‌ వేలంలోకి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన జర్నీని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ వీడియో పోస్ట్‌ చేశాడీ ఆల్‌రౌండర్‌.

‘ముంబయి ఇండియన్స్‌తో నా ప్రయాణం’ అంటూ వీడియోను పోస్ట్‌ చేసిన హార్దిక్‌.. ‘ఈ జట్టుతో నా ప్రయాణం, జ్ఞాపకాలను జీవితాంతం నాతో పాటు ఉంచుకుంటాను. నేను చేసిన స్నేహాలు, ఏర్పడిన బంధాలు, ప్రజలు, అభిమానులకు నిరంతరం కృతజ్ఞలతో ఉంటాను. మీతో ఉన్నప్పుడు నేను ఒక క్రికెటర్‌గానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో ఎదిగాను. నేను యువకుడిగా పెద్ద పెద్ద కలలతో క్రికెట్‌లోకి అడుగుపెట్టాను. మేం కలిసి ఆడాం.. కలిసి పోరాడాం.. కలిసి గెలిచాం.. కలిసి ఓడిపోయాం. ఈ జట్టుతో నేను గడిపిన ప్రతి క్షణానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంత గొప్ప బంధాలకైనా ఎప్పుడో ఒకసారి ముగింపు ఉంటుందంటారు. కానీ ముంబయి ఇండియన్స్‌ నా హృదయంలో నిలిచి ఉంటుంది’ అని భావోద్వేగంతో రాసుకొచ్చాడు.

Also Read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

IND vs NZ: 6 సంవత్సరాల నిరీక్షణ.. చరిత్ర సృష్టించిన ఆటగాడికి టీమిండియాలో అవకాశం.. ముంబై టెస్టులో అరంగేట్రం?

India vs South Africa: భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుందా.. విరాట్ కోహ్లీ ప్రశ్నకు బీసీసీఐ ఏం చెప్పిందంటే?