IND vs NZ: రహానె, పుజారాను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

శుక్రవారం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో అజింక్య రహానే, ఛెటేశ్వర్ పుజారాను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు...

IND vs NZ: రహానె, పుజారాను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..
Rahane, Pujara
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 03, 2021 | 7:44 AM

శుక్రవారం నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో అజింక్య రహానే, ఛెటేశ్వర్ పుజారాను తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. ఈ ఇద్దరూ టెస్ట్ క్రికెట్‌లో విఫలమతున్నారు. మరోవైపు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాన్ని దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాన్పూర్ టెస్టులో సెంచరీ బాదాడు. ఇప్పుడు రెండో టెస్టు కోసం కోహ్లీ తిరిగి ఎలెవన్‌లోకి వెళ్లనున్న నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని హర్మిసన్ చెప్పాడు.

హర్మిసన్, తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ, ఇది “కష్టమైన ఎంపిక” అని చెప్పాడు. అయితే అతను ముంబై టెస్ట్‌కు రహానే, పుజారా ఇద్దరినీ మినహాయిస్తానని చెప్పాడు. “ఇది చాలా కఠినమైన ప్రశ్న, కానీ నా వినయపూర్వకమైన అభిప్రాయం ప్రకారం, నేను వారిద్దరినీ (రహానే, పుజారా) వదిలివేస్తాను. వారు అద్భుతమైన కెరీర్‌లను కలిగి ఉన్నారు. భారత్‌కు మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ వారిద్దరూ భారత జట్టు నుండి తప్పుకున్నానేను ఆశ్చర్యపోను” అని హర్మిసన్ అన్నాడు. 63 టెస్టులు, 58 వన్డేలు, రెండు టీ20లు ఆడిన మాజీ రైట్ ఆర్మ్ సీమర్.. రహానే, పుజారా గత టెస్ట్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోర్లకే ఔటయ్యారని గుర్తు చేశాడు.

కోహ్లీ గైర్హాజరీతో రహానే తొలి టెస్టులో కెప్టెన్‎గా వ్యవహరించాడు. మొదటి ఇన్నింగ్స్‎లో 35, రెండో ఇన్నింగ్స్‎లో 4 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో అతను ఆడిన 16 టెస్టు మ్యాచ్‌ల్లో రహానే సగటు కేవలం 24.39 మాత్రమే ఉంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో ఒక సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండు అర్ధ సెంచరీలు. మరోవైపు, పుజారా తన చివరి 16 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కేవలం 27.65 సగటుతో ఉన్నాడు, ఇది అతని కెరీర్ సగటు 45.11 కంటే చాలా తక్కువ. గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ను ఈ మ్యాచ్‎లో అరంగేట్రం చేయవచ్చని హర్మిసన్ చెప్పాడు.

Read Also.. IND vs NZ: 6 సంవత్సరాల నిరీక్షణ.. చరిత్ర సృష్టించిన ఆటగాడికి టీమిండియాలో అవకాశం.. ముంబై టెస్టులో అరంగేట్రం?