BCCI on TeamIndia players food: టీమిండియా ప్లేయర్స్ ఫుడ్ మెనుపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ.!(వీడియో)
ఈనెల 25వ తేది నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత క్రికెటర్ల మెనూపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై బీసీసీఐ ట్రెసరర్ అరుణ్ ధూమల్ స్పష్టతనిచ్చాడు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు.
ఈనెల 25వ తేది నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత క్రికెటర్ల మెనూపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై బీసీసీఐ ట్రెసరర్ అరుణ్ ధూమల్ స్పష్టతనిచ్చాడు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు. ఆటగాళ్ల డైట్ ప్లాన్‌కు సంబంధించి మేమెలాంటి నిబంధనలు విధించలేదని, ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు. అది శాకాహారమా.?, మాంసాహారమా.? అనేది వారిష్టమని క్లారిటీ ఇచ్చారు అరుణ్ ధూమల్.కాన్పూర్ వేదికగా జరుగనున్న తొలి టెస్టులో భారత క్రికెటర్ల ఆహారంలో పంది, గోవు మాంసాలను నిషేధించడమే కాక.. హలాల్ చేసిన మాంసాన్నే ఆటగాళ్లకు అందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీంతో ఆటగాళ్లు తినే ఆహారంపై ఆంక్షలు విధించడమేంటని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుతో పాటు న్యూజిలాండ్ జట్టులో కూడా ముస్లిం ఆటగాళ్లు ఉండటంతో హలాల్ చేసిన మాంసాన్ని అందించాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..