AP Crime News: నాటుసారాపై పోలీసుల కన్నెర్ర.. 45 వేల లీటర్ల సరుకు ధ్వంసం – Watch Video
Andhra Pradesh Crime News: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో సారా ఏరులై పారుతోంది. తాజాగా పోలీసులు, SEB అధికారులు 46 వేల లీటర్ల సారాను ధ్వంసం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో సారా ఏరులై పారుతోంది. తాజాగా పోలీసులు, SEB అధికారులు 46 వేల లీటర్ల సారాను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన సారాయి విలువ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే కాదు.. జిల్లా వ్యాప్తంగా 4 నెలల నుండి వివిధ ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసి భారీ ఎత్తున నాటు సారాయి ధ్వంసం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల కేసులు నమోదయ్యాయి. 16 SEB స్టేషన్లతో పాటు, 56 పోలీస్ స్టేషన్లకు సంబంధించి మొత్తం 2,998 సారా కేసులు నమోదయ్యాయి. కాపు సారా బడుగు జీవుల బతుకులను కాటేస్తోంది. తాగుడుకు బానిసలైన అనేక మంది నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ సారాకు వందల మంది బలయ్యారు.
నాటుసారాను ధ్వంసం చేస్తున్న ఎస్ఈబీ అధికారులు.. వీడియో
Also Read..
SBI: ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇలా చేయండి.. ఖాతాదారులకు ఎస్‌బీఐ ట్వీట్..