Prostitution Racket: జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా.. పోలీసుల నిఘాలో దొరికిన యువతులు..

Prostitution Racket: జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా.. పోలీసుల నిఘాలో దొరికిన యువతులు..
Prostitution Racket

జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పాడు పనికి తెరలేపారు కొందరు. ఓ ఇంట్లో యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న..

Sanjay Kasula

|

Dec 03, 2021 | 5:09 PM

జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పాడు పనికి తెరలేపారు కొందరు. ఓ ఇంట్లో యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన నస్రీన్‌బేగం(35) కేటరింగ్‌ నిర్వహిస్తోంది. ఈమె టీకేఆర్‌ కమాన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. వారు అందించిన సమాచారం నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత గురువారం సాయంత్రం దాడి చేశారు.

ఫ్లాట్‌కు యువతులను రప్పించి.. ఎవరికి అనుమానం రాకుండా వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి ఫ్లాట్‌కు రప్పిస్తున్నారు. నిర్వాహకురాలు నస్రీన్‌బేగంతో పాటు మరో ఇద్దరు యువతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి: Jawad Cyclone Live: జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌.. సుడులు తిరుగుతూ విశాఖ తీరం వైపు..

Health Tips : కాలీఫ్లవర్ తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu