AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Chowdhury: బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునేందుకే తన దగ్గర పెట్టుబడులు.. పోలీసుల ముందు కక్కేస్తున్న శిల్ప..

కస్టడీ డే1 రోజే శిల్ప చౌదరి నుంచి కీలక విషయం రాబట్టారు పోలీసులు. బ్లాక్ మనీని తన దగ్గర పెట్టుబడి పెట్టి దాన్ని వైట్‌గా మార్చేందుకు చాలామంది డబ్బు ఇచ్చారన్న విషయాన్ని కక్కేసిందామె.

Shilpa Chowdhury: బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునేందుకే తన దగ్గర పెట్టుబడులు.. పోలీసుల ముందు కక్కేస్తున్న శిల్ప..
Shilpa Chowdhury
Sanjay Kasula
|

Updated on: Dec 03, 2021 | 6:53 PM

Share

కస్టడీ డే1 రోజే శిల్ప చౌదరి నుంచి కీలక విషయం రాబట్టారు పోలీసులు. బ్లాక్ మనీని తన దగ్గర పెట్టుబడి పెట్టి దాన్ని వైట్‌గా మార్చేందుకు చాలామంది డబ్బు ఇచ్చారన్న విషయాన్ని కక్కేసిందామె. ఈ ఉదయం 11 గంటలకు కస్టడీలో విచారణ ప్రారంభంకాగానే శిల్ప సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బినామీ లెక్కలపై వేసిన ప్రశ్నలకు ఆమే నోరే విప్పలేదు. కానీ.. రిజిస్ట్రర్ అయిన కేసులు, కాల్‌డేటా సహా ఇతర ఆధారాలను కళ్లముందు ఉంచగానే శిల్పా చౌదరి బోరున ఏడ్చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కొన్ని విషయాలను ఒప్పుకున్నట్లు సమాచారం. చాలామంది తనకు డబ్బు అప్పుగా మాత్రమే ఇచ్చారని, కొందరు మాత్రం బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునేందుకు పెట్టుబడులు పెట్టారట.

మరోవైపు శిల్ప చౌదరిపై ఇప్పటివరకూ పోలీసులకు అధికారికంగా వస్తున్న కేసులకంటే మా డబ్బు ఇప్పించండి మహాప్రభో అంటూ వస్తున్న ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. శిల్ప చెప్పిన సమాధానాలు వింటుంటే బ్లాక్‌ మనీ ఇచ్చిన వాళ్లే ఇలా కేసులకు తటపటాయిస్తున్నట్లు భావించాల్సిన పరిస్థితి వస్తోంది.

అందుకే పోలీసులు కూడా రేపు సాయంత్రం 4గంటల వరకూ టైమ్‌ ఇచ్చారు. డబ్బు పోగొట్టుకున్న వాళ్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు.

ఇవి కూడా చదవండి: Jawad Cyclone Live: జెట్‌ స్పీడ్‌తో దూసుకొస్తున్న జొవాద్‌.. సుడులు తిరుగుతూ విశాఖ తీరం వైపు..

Health Tips : కాలీఫ్లవర్ తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..