Biryani On Tamota: కిలో టమాటాకు.. కేజీ బిర్యానీ ఫ్రీ..! రెస్టారెంట్ యజమాని వినూత్న ఆఫర్.. ఎక్కడంటే..(వీడియో)
గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల నుంచి టమాటాకు డిమాండ్ పెరిగింది. ఐదు రూపాయలు కిలో అమ్మే టమోటా ధర నేడు వంద దాటింది. భారీ వర్షాల కారణంగా పంటనష్టం జరగడంతో టమాటా ధర అమాంతం పెరిగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల నుంచి టమాటాకు డిమాండ్ పెరిగింది. ఐదు రూపాయలు కిలో అమ్మే టమోటా ధర నేడు వంద దాటింది. భారీ వర్షాల కారణంగా పంటనష్టం జరగడంతో టమాటా ధర అమాంతం పెరిగింది. తమిళనాడులో కిలో టమాటా ధర 150 రూపాయలు పలుకుతుంది. దీంతో తమిళనాడులోని ఒక రెస్టారెంట్ యజమాని గమ్మత్తయిన ఆఫర్‌ను ప్రజలకు పెట్టారు.
కిలో టమాటా ఇస్తే కిలో బిర్యానీ ఫ్రీ అంటూ తన రెస్టారెంట్ ముందు బోర్డు పెట్టారు. చెన్నై నగరానికి దూరంగా ఉన్న అంబూర్ లో బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు పెట్టిన ఈ బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కిలో టమాటాకు, కేజీ బిర్యానీ ఫ్రీ అంటూ చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. మరో బిర్యానీ హోటల్ నిర్వాహకుడు వందరూపాయల కేజీ బిర్యానీ అని, రెండు కేజీలు కొంటే అరకిలో టమాటా ఉచితమని ఆయన ప్రకటించాడు. ఇప్పుడు టామాటా ఉల్లిని మించిపోయింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

