Viral Video: అప్పుడే పుట్టిన దూడ కోసం తల్లి గెదే ఆరాటం బిడ్డను ఎత్తుకెళ్తున్నారనే భయంతో 3కి.మీ పరిగెత్తిన గెదే..(వీడియో)

Viral Video: అప్పుడే పుట్టిన దూడ కోసం తల్లి గెదే ఆరాటం బిడ్డను ఎత్తుకెళ్తున్నారనే భయంతో 3కి.మీ పరిగెత్తిన గెదే..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 03, 2021 | 8:54 AM

అమ్మ ప్రేమ, త్యాగానికి వెలకట్టలేం, నిర్వచనం కూడా చెప్పేందుకు మాటలు చాలవు..అది మనుషులైనా, జంతువులనే కదా..ఏ జీవుల్లోనైనా తల్లి ప్రేమ ఒక్కటే..తల్లికి ఎంత ప్రమాదం జరిగిననా, తన బిడ్డల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది....


అమ్మ ప్రేమ, త్యాగానికి వెలకట్టలేం, నిర్వచనం కూడా చెప్పేందుకు మాటలు చాలవు..అది మనుషులైనా, జంతువులనే కదా..ఏ జీవుల్లోనైనా తల్లి ప్రేమ ఒక్కటే..తల్లికి ఎంత ప్రమాదం జరిగిననా, తన బిడ్డల కోసం ఆరాటపడుతూనే ఉంటుంది..ఇక ప్రమాదంలో వున్న తన బిడ్డను కాపాడుకోవడానికి, ఆ తల్లి తన బిడ్డ సంరక్షణ కోసం ఎంతదూరమైనా సరే వెళుతుంది.. ఎంత పెద్ద ప్రమాదాన్ని అయినా ఎదుర్కొంటుంది. చెన్నైలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు చూస్తే ఎంతటి వారైన సరే..భావోద్వేగానికి గురికాక తప్పదు..చెన్నై పోరూర్ కు చెందిన ఓ వ్యక్తి పశువుల్ని పెంచుతూ పాల వ్యాపారం చేస్తుంటాడు. ఎప్పటిలానే తన పశువులను మేత కోసం బయటకు తీసుకెళ్లాడు..అక్కడే గేదె ఈనింది. బుల్లి దూడ బయటకు వచ్చింది. ఆ బుజ్జి దూడను ఎత్తుకుని బైక్‌ మీద ఇంటికి బయలుదేరారు. అనూహ్యంగా అప్పటివరకు మామూలుగానే ఉన్న తల్లి గేదె.. తన బిడ్డను ఎక్కడికో తీసుకెళుతున్నారన్న ఆందోళనతో.. బండి వెనుక పరుగులు తీసింది. దాదాపు మూడు కి.మీ. పాటు అలానే యజమాని వాహనంతో పాటు పరుగులు తీసింది. ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఘటన మరోమారు వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తల్లి ప్రేమను నిర్వచిస్తూ…కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..