Elephants: బురద చెరువులో కూరుకుపోయిన ఏనుగుల మంద.. చూస్తుండగానే..!

Elephants: అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో ఐదు ఏనుగుల మంద బురద చెరువులో చిక్కుకుపోయాయి. వెంటనే గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించడంతో

Elephants: బురద చెరువులో కూరుకుపోయిన ఏనుగుల మంద.. చూస్తుండగానే..!
Elephants

Elephants: అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో ఐదు ఏనుగుల మంద బురద చెరువులో చిక్కుకుపోయాయి. వెంటనే గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారం అందించడంతో వాటిని సురక్షితంగా బయటకు తీశారు. అటవీశాఖ అధికారులు, స్థానికులు కలిసి ఆ ఏనుగులను రక్షించారు. వివరాల్లోకెళితే.. గోల్‌పరా జిల్లాలోని లఖిపూర్ సమీపంలోని చోయిబరీ ప్రాంతంలో బురద చెరువులో రాత్రి ఒక గున్న ఏనుగు సహా ఐదు అడవి ఏనుగులు చిక్కుకున్నాయి. ఆహారం కోసం మేఘాలయ వైపు నుండి సమీపంలోని కొండ ప్రాంతం నుండి ఏనుగుల గుంపు ఈ ప్రాంతానికి వచ్చిందని, ఆ సమయంలో పొరపాటున ఈ ఐదు ఏనుగులు చెరువులో కూరుకుపోయాయని స్థానికులు తెలిపారు. దీనిని గమనించిన స్థానికులు.. వెంటనే అటవీశాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక గ్రామస్తుల సహకారంతో ఏనుగులను రక్షించారు. “ఒక చెరువులో ఐదు ఏనుగులు చిక్కుకున్నాయని సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాము. గున్న ఏనుగు సహా ఐదు ఏనుగులను రక్షించేందుకు రెండు జేసీబీలను, తాళ్లను ఉపయోగించాం. ఐదు ఏనుగులు సురక్షితంగా బయటకు వచ్చాయి’’ అని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏనుగులకు ఏలాంటి ప్రమాదం జరుగలేదని, అవి క్షేమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. అవి క్షేమంగా బయటపడటంతో స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

Click on your DTH Provider to Add TV9 Telugu