Viral News: ఆ డాక్టర్‌ వల్లే నేను ఇలా పుట్టాల్సి వచ్చింది.. యువతి పిటిషన్.. కోర్టు సంచలన తీర్పు..!

Viral News: వైకల్యంలో బాధ పడుతున్న ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదంటూ సంబంధిత డాక్టర్‌ను కోర్టుకు లాగింది. తన తల్లికి తాను

Viral News: ఆ డాక్టర్‌ వల్లే నేను ఇలా పుట్టాల్సి వచ్చింది.. యువతి పిటిషన్.. కోర్టు సంచలన తీర్పు..!
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 03, 2021 | 5:46 AM

Viral News: వైకల్యంలో బాధ పడుతున్న ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదంటూ సంబంధిత డాక్టర్‌ను కోర్టుకు లాగింది. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి ఆ డాక్టర్‌ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించి ఉండేదాన్ని కాదంటూ తాను వేసిన పిటిషన్‌లో పేర్కొంది. వివరాల్లోకెళితే.. యూకే కి చెందిన ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా అనే లోపంతో జన్మించింది. అంటే.. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం అనమాట. ఈ సమస్య కారణంగా.. ఆమె రోజు మెడికల్‌ ట్యూబ్‌లను అమర్చుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం గడుపుతోంది.

అయితే, తన తల్లి ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో సంబంధిత డాక్టర్ సరైన సూచనలు ఇస్తే.. తనకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఈవీ టూంబ్స్ భావించింది. సరైన సూచనలు ఇవ్వనందునే తనకు ఈ పరిస్థితి ఎదురైందని డాక్టర్‌ ఫిలిప్ మిచెల్‌‌పై ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది ఈవీ టూంబ్స్. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్‌ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది. దాని ఆధారంగా.. ఈవీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి.. ఈవీ టూంబ్స్‌ ఆరోపణలను సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్‌.. స్పైనా బిఫిడా లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్‌ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పిల్లల పుట్టుకకు దారితీసే తప్పుడు సలహాలకు ఆరోగ్య సంరక్షణ నిపుణులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ఇక ఈవీ టూంబ్స్‌ దివ్యాంగ ‘షో జంపర్‌’గా పలు పోటీల్లో పాల్గొంటూ.. దివ్యాంగులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. టూంబ్స్‌కి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలామందికి సుపరిచితం కూడా. తన అభిమానుల కోసం టూంబ్స్.. తన జీవిత ప్రయాణాన్ని డాక్యూమెంట్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 21 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా లో ఆమె తన రోజువారీ జీవితం, వృత్తిపరమైన పనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
సినీ ఇండస్ట్రీపై పగబట్టిన సీఎం రేవంత్‌: బండి
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
మోహన్‌బాబు, అల్లు అర్జున్‌‌ ఘటనలపై తెలంగాణ డీజీపీ రియాక్షన్ ఇదే..
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకుంటున్నా.. పవన్‌కళ్యాణ్
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ..తర్వాత జరిగింది
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.