HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ వేలంలోనూ HMDAకు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్‌..

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..
Uppal Bhagayath Plots
Follow us

|

Updated on: Dec 02, 2021 | 10:08 PM

ఉప్పల్‌ భగాయత్‌ మూడో దశ వేలంలోనూ HMDAకు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి 1 లక్షా వెయ్యి రూపాయల చొప్పున ధర పలకడం కొసమెరుపు. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్‌ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో ఉప్పల్‌ ఏరియా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఎన్‌ఆర్‌ఐలతో పాటు స్థానిక రియల్టర్లు కూడా నువ్వా నేనా ? అనే రీతిలో ధరలు పెంచుకుంటూ పోయారు.

చదరపు గజానికి 35 వేలు నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా ఒక లక్షా వెయ్యి రూపాయల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19వేల చదరపు గజాలకే 141 కోట్ల 61 లక్షలు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున 60 వేలు ధర పలికినా సుమారు 900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మల్టీ పర్పస్‌ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ఎన్ఆర్‌ఐలు పెద్ద ఎత్తున వేలంలో పాల్గొనడంతో రెండో రోజు మల్టీపర్పస్‌ భూములకు చదరపు గజానికి కనీసం 70 వేల దాకా ధర పలికే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా ఉప్పల్‌ భూ విక్రయాల్లో రికార్డు సృష్టిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
మీ కళ్లను మాయచేసే చిత్రం.. ఈ ఫోటోలో జింకను కనిపెట్టగలరా
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
వేసవిలో పెరుగు చద్దన్నం టై చేసి చూడండి.. అమ్మమ్మకాలం నాటి రెసిపీ
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..