CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..

ఆరు త‌డి పంట‌లే వేయాల‌ని సీఎం కేసీఆర్ రైతుల‌కు సూచించారు. వానాకాలంలో వ‌రి పంట వేసుకుని, యాసంగిలో ఆరుత‌డి పంట‌లు వేసుకోవాల‌ని రైతుల‌కు సూచించారు. పంట‌ల సాగుపై కూడా..

CM KCR: వానాకాలంలో వ‌రి.. యాసంగిలో ఆ పంట‌లే వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచనలు..
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 02, 2021 | 5:40 PM

గ‌ద్వాల ప‌ర్యట‌న‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా పెబ్బేర్ మండ‌లం రంగాపూర్‌లో, కొత్తకోట మండలం విలియంకొండలో కాసేపు ఆగారు. జాతీయ ర‌హ‌దారి 44 ప‌క్కన ఉన్న పంట పొలాల‌ను ప‌రిశీలించారు. మినుము పంట సాగు చేస్తున్న మ‌హేశ్వర్ రెడ్డి, వేరుశ‌న‌గ వేసిన రాములుతో కాసేపు ముచ్చటించి.. పంటలపై ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ఆరు త‌డి పంట‌లే వేయాల‌ని సీఎం కేసీఆర్ రైతుల‌కు సూచించారు. వానాకాలంలో వ‌రి పంట వేసుకుని, యాసంగిలో ఆరుత‌డి పంట‌లు వేసుకోవాల‌ని రైతుల‌కు సూచించారు. పంట‌ల సాగుపై కూడా ద‌రిద్రపు రాజ‌కీయాలు , యుద్ధాలే జ‌రుగుతున్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణమోహన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో రైతులను పలుకరించారు.

అంతకు ముందు.. జోగులాంబ గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డిని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యుల‌ను కూడా సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కృష్ణమోహ‌న్ రెడ్డి తండ్రి వెంక‌ట్రామిరెడ్డి చిత్రపటానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం కృష్ణమోహ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వారిని ఓదార్చారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వెంక‌ట్రామిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు.

ఇవి కూడా చదవండి: Akhanda Movie: అఖండ మూవీ థియేటర్ సీజ్.. మ్యాట్నీ షోను అడ్డుకున్న అధికారులు.. ఎందుకంటే..

Teeth Tips: ప‌చ్చ‌గా ఉన్న‌ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మార్చే స‌ర్‌ప్రైజింగ్ కిచెన్ రెమిడీస్..

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..