Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్

German Athlete Johannes Vetter Interview: నీరజ్ పోడియంపైకి ఎక్కి భారతదేశానికి పతకం అందించడాన్ని చూసి సంతోషించిన వారిలో అతను ఒకరు. అందరి యువకుల్లాగే అమ్మాయిల గురించి కూడా మేమిద్దరం మాట్లాడామంలూ నీరజ్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్
Johannes Vetter Vs Neeraj Chopra
Follow us

|

Updated on: Dec 02, 2021 | 10:10 PM

Johannes Vetter Interview: టోక్యో ఒలంపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్ పోడియంపైకి ఎక్కి భారతదేశానికి పతకం అందించడాన్ని చూసి సంతోషించిన వారిలో అతని బలమైన పోటీదారు జోహన్నెస్ వెటర్ ఒకరు. జర్మనీకి చెందిన జోహన్నెస్ వెటర్.. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించాడు. అతని వ్యక్తిగత రికార్డు 97.76గా ఉంది. అయితే నీరజ్ చోప్రా పాల్గొన్న టోక్యో ఒలింపిక్ క్రీడల్లో 82.52 మీట్లు విసిరి 9వ స్థానంలో నిలిచాడు. జావెలిన్ అభిమానులను అధిక సంఖ్యలో సంపాదించుకుని తన ఆటలో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పాడు. ప్రజలు ఇప్పటికీ జాన్ జెలెజ్నీ విసిరిన ప్రపంచ రికార్డు త్రో 98.48 మీటర్లను మరచి పోలేదు. అలాగే ఆపై 100 మీటర్ల మార్కును అధిగమించడం గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. అయితే భారత స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్కును బద్దలు కొట్టడం వైపు చూస్తున్నారు. న్యూస్ 9 డిజిటల్‌కి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎన్నో విషయాలు పంచుకున్నాడు. భారత స్టార్ త్రోయర్ నీరజ్‌తో తన సంబంధాలు, భారత సోషల్ మీడియా ఫాలోవర్స్, 90 మీటర్ల క్లబ్‌లో చేరాలంటే నీరజ్ ఏంచేయాలో లాంటి అనేక విషయాలపై మాట్లాడాడు.

చాలామందికి ఇదో మానసిక అవరోధం..! ‘చాలా మంది జావెలిన్ త్రోయర్లకు ఇది మానసిక అవరోధం లాంటిది. నేను దాని గురించి పెద్దగా ఆలోచించనందున నాకు ఇది చాలా సులభంగా ఉంటుంది. నన్ను నేను అధిగమించాలని కోరుకుంటాను. నేను పోటీకి వెళ్లినప్పుడు, నీరజ్ చోప్రా లేదా థామస్ రోహ్లర్ లేదా ఇతర గొప్ప వ్యక్తుల వైపు చూడను. నన్ను నేను చూసుకుంటాను. నేను నా కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను’ అని తన సక్సెస్ సీక్రెట్స్ తెలిపాడు.

90 మీటర్ల క్లబ్‌లోకి నీరజ్ కచ్చితంగా వస్తాడు..! నీరజ్ గురించి మాట్లాడుతూ, ’90 మీటర్ల క్లబ్‌లోకి దూసుకెళ్లడానికి నీరజ్ ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 90 మీటర్లకు పైగా విసరడం నీరజ్‌కి సాధ్యం కాదని నేను అనను. అతను 90 మీటర్లకు పైగా విసిరేందుకు చాలా దగ్గరగా ఉన్నాడు (నీరజ్ వ్యక్తిగత అత్యుత్తమం 88.07 మీ గా ఉంది). నీరజ్ చాలా ప్రతిభావంతుడు. మంచి టెక్నిక్ ఉంది. జావెలిన్ విసిరేవారిని ఒకరితో ఒకరు పోల్చకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది. నా జెనెటిక్ మేకప్ నాకు ఎడమ కాలుతో బలంతోపాటు ఇంకా ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇక నీరజ్ తన ఎడమ కాలుపై పని చేసి, అతని ఎగువ భాగంలో మరింత శక్తిని, ఒత్తిడిని పొందడానికి మెరుగైన బ్లాక్‌ను పొందగలడని నేను భావిస్తున్నాను. అతనికి మంచి కోచ్ (జర్మన్ బయోమెకానిక్స్ నిపుణుడు డాక్టర్ క్లాస్ బార్టోనిట్జ్‌లో) ఉన్నారని నేను భావిస్తున్నాను. దాన్ని పరిష్కరించడానికి వారు చాలా కష్టపడి పని చేస్తారు. ప్రస్తుతం నీరజ్ చాలా చిన్నవాడు. భవిష్యత్తులో అతనో గొప్ప పోటీదారుగా తయారవుతాడని’ పేర్కొన్నాడు.

అమ్మాయిల గురించి కూడా మాట్లాడుకున్నాం..! నీరజ్, తన మధ్య ఉన్న ఈక్వేషన్ గురించి మాట్లాడుతూ, టోక్యో గేమ్స్‌కు ముందు, నేను, నీరజ్ ఒకే కారులో హెల్సింకీ నుంచి కుర్టానే వరకు కలిసి ప్రయాణించాం. జావెలిన్ త్రోయర్లందరూ ఒకరితో ఒకరు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. నీరజ్, నేను మా ఆలోచనల కారణంగా ఒకే వేవ్‌లెంగ్త్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. మేమిద్దరం నిజంగా చిన్నవాళ్లమే. (నీరజ్ వయసు 23 ఏళ్లు, వెటర్ వయసు 28ఏళ్లు). మేం జావెలిన్ గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే మా సంబంధాన్ని మరింత దగ్గరగా చేస్తుంది. మేం ఆహారం, మా కుటుంబాలు, విద్య, జర్మనీతోపాటు భారతదేశంలోని సంస్కృతి గురించి, సాధారణ యువకుల మాదిరిగానే అమ్మాయిలు, కార్లు వంటి వాటి గురించి మాట్లాడాం. నీరజ్ టోక్యోలో గెలుపొందినందుకు నేను నిజంగా సంతోషించాను. నేను అక్కడ నా పరుగుతో పోరాడుతున్నాను. కానీ, నీరజ్‌కు అంత సమస్యగా కనిపించలేదు. నీరజ్ గెలించేందుకు పూర్తిగా అర్హుడు. మేమిద్దరం నిజంగా ఒకరికొకరు న్యాయంగా ఉన్నందున నేను నీరజ్‌పై పోటీ చేయాలనుకుంటున్నాను. ఇది పరిస్థితిని సులభతరం చేస్తుందని నమ్ముతున్నట్లు’ తెలిపాడు.

నీరజ్ పతకం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్‌కే గర్వకారణం..! టోక్యోలో నీరజ్ స్వర్ణం గెలవడంతో, జావెలిన్ క్రీడ మరింత ప్రజాదరణ పొందిందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఖచ్చితంగా. అయితే! భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలి పతక విజేత నీరజ్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశం భారతదేశం. అయితే, అతను స్వర్ణం గెలవడం మా క్రీడకు అత్యుత్తమ ప్రకటనగా మారింది. మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నీరజ్ పతకం భారతదేశంలోని పేదరికం వంటి సామాజిక సమస్యలతో పోరాడుతున్న కొంతమందికి, ఆశతో ఎదురుచూస్తూ, కష్టపడి పనిచేయడానికి కూడా సహాయపడింది. కాబట్టి, నీరజ్ పతకం భారతీయ సమాజానికి మాత్రమే కాకుండా జావెలిన్ క్రీడకు కూడా చాలా మంచిది’ అని తన అభిప్రాయాన్ని పేర్కొన్కాడు.

నేను ప్రపంచ రికార్డు సాధించాలనే భారత అభిమానులు కూడా ఉన్నారు..! ఆగస్ట్‌లో, జూలియన్ వెబర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో టోక్యో 2020 తర్వాత అతని సోషల్ మీడియా ఫాలోవర్లను అమాంతం పెంచేసింది. అయితే ఇందులో ఉన్న కొత్త ఫాలోవర్స్ అందరూ నీరజ్ అభిమానులే కావడం విశేషం. నీరజ్ అభిమానులపై మాట్లాడుతూ, ‘ఈ మార్పును నేను గమనించాను. అయితే, భారతదేశం నుంచి చాలా మంది ప్రజలు నన్ను అనుసరించడం ప్రారంభించారు. ఒలంపిక్స్ తర్వాత మాత్రం కొంతమంది అసభ్యంగా కామెంట్లు కూడా చేశారు. అది నాకు అర్థం కాలేదు. కానీ, అది ఆటలో భాగం. నేను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలని కోరుకునే చాలా మంది మంచి వ్యక్తులు భారతదేశంలో నన్ను అనుసరిస్తున్నారని నాకు తెలుసు. వీరిలో చాలామంది పోటీల సమయంలో కూడా నాకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో భారతదేశంలో ట్రాక్ అండ్ ఫీల్డ్, ముఖ్యంగా జావెలిన్‌కు అధిక ప్రాముఖ్యం లభిస్తుందని నిజంగా గర్విస్తున్నానుస’ అంటూ ముగించాడు.

-అమిత్ కామత్

Also Read: 14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

IPL 2022 Auction: ‘ఐపీఎల్ వేలం ఓ డ్రామా.. అది అవసరం లేదు.. మూడేళ్ల తరువాత కీలక ప్లేయర్లను కోల్పోవడం సరికాదు’