India vs South Africa: భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుందా.. విరాట్ కోహ్లీ ప్రశ్నకు బీసీసీఐ ఏం చెప్పిందంటే?

India Tour Of South Africa: డిసెంబర్ 17 నుంచి వచ్చే ఏడు వారాల పాటు భారత జట్టు దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, పార్ల్, కేప్ టౌన్‌లలో జరగనున్నాయి.

India vs South Africa: భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్లనుందా.. విరాట్ కోహ్లీ ప్రశ్నకు బీసీసీఐ ఏం చెప్పిందంటే?
India Tour Of South Africa
Follow us
Venkata Chari

|

Updated on: Dec 02, 2021 | 3:54 PM

Indian Cricket Team: కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఇబ్బందుల్లో పడింది. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటన కూడా వచ్చింది. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన గురువారం తెలిపారు. దీంతో జట్టులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ దీనిపై మాట్లాడటం ప్రారంభించినట్లు అర్థమవుతోంది. అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆటగాళ్లకు సమాచారం ఇస్తున్నారు. డిసెంబర్ 9న టీమిండియా జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ టూర్‌ను వారం రోజుల పాటు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

న్యూజిలాండ్‌తో రెండో, చివరి టెస్టుకు ఒక రోజు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ, ‘మేం బీసీసీఐతో మాట్లాడుతున్నాం. మాకు మరింత స్పష్టత అవసరం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ విషయంపై స్పష్టంగా తెలుస్తుందని ఆశిస్తున్నాం. రాహుల్ భాయ్ (ద్రవిడ్) సీనియర్ ఆటగాళ్లందరితో మాట్లాడాడు. మనం ఎలాంటి గందరగోళంలో ఉండకపోవడం చాలా మంచింది. మేం సాధారణ పరిస్థితుల్లో ఆడటం లేదు. జట్టు సభ్యులందరితో మాట్లాడాం.టెస్ట్ మ్యాచ్‌లు ఆడటంపై మా దృష్టిని దూరం చేయదు. అయితే ఈ విషయంపై మాకు స్పష్టత కావాలి’ అని పేర్కొన్నాడు.

‘మనం సత్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మనల్ని ఇబ్బందులకు గురిచేసే వాటిని మనం విస్మరించలేం. ఇంకా కొంతమంది ఆటగాళ్లు జట్టులో చేరలేదు. వారు జట్టు బబుల్‌లో చేరగానే నిర్బంధంలో ఉంటారు. చార్టర్ విమానంలో వస్తారు. స్పష్టత తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. త్వరలో ఈ విషయంపై కచ్చితమైన నిర్ణయం వస్తుంది. నేను చెప్పినట్లుగా, ప్రస్తుతం మా దృష్టి రెండవ టెస్ట్‌పైనే నిలిచింది’ అని పేర్కొన్నాడు.

3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20ల సిరీస్ ఆడేందుకు భారత సీనియర్ జట్టు డిసెంబర్ 17 నుంచి వచ్చే ఏడు వారాల పాటు దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు జోహన్నెస్‌బర్గ్, సెంచూరియన్, పార్ల్, కేప్ టౌన్‌లలో జరుగుతాయి. Omicron వేరియంట్ కనిపించిన తర్వాత, అనేక దేశాలు దక్షిణాఫ్రికాపై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. భారతదేశం ఇప్పటి వరకు అలాంటి చర్యలేమీ తీసుకోలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇండియా ఏ ప్రస్తుతం అక్కడ ఆడుతోంది.

Also Read: IPL 2022 Auction: ఐదుగురు కీలక ఆటగాళ్లపై కన్నేసిన ఆర్‌సీబీ.. కోహ్లీ ప్లాన్ మాములు లేదుగా..!

India Tour of South Africa: భారత్ పర్యటన వాయిదా..! ఒమిక్రాన్ వేరియంటే కారణం..

సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS